BRS: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. కీలక నేత జంప్..?
ABN , Publish Date - Jun 14 , 2024 | 11:06 AM
బీఆర్ఎస్(BRS) పార్టీకి మరో బిగ్ షాక్ తగలనుందా? కీలక నేత ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. మంత్రి అవ్వాలనే తన కలను నేరవేర్చిన కేసీఆర్‌కు(KCR) హ్యాండిచ్చేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో(Congress Party) చేరేందుకు చర్చలు మొదలుపెట్టారా? అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది.
వరంగల్, జూన్ 14: బీఆర్ఎస్(BRS) పార్టీకి మరో బిగ్ షాక్ తగలనుందా? కీలక నేత ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. మంత్రి అవ్వాలనే తన కలను నేరవేర్చిన కేసీఆర్‌కు(KCR) హ్యాండిచ్చేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో(Congress Party) చేరేందుకు చర్చలు మొదలుపెట్టారా? అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. రేపుమాపో ఆయన బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంత? బీఆర్ఎస్ పార్టీని వీడబోయే ఆ నేత ఎవరు? ఇంతకీ ఆ నాయకుడు ఏమంటున్నారు? ఈ కథనంలో తెలుసుకుందాం..
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల తరువాత రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఫలితాలు బీజేపీ, కాంగ్రెస్‌కు అనుకూలంగా రావడంతో ఆ రెండు పార్టీలు మాంచి జోష్ మీదున్నాయి. అదే సమయంలో బీఆర్ఎస్ పూర్తిగా డీలా పడిపోయింది. దాంతో ఆ పార్టీలో ఉండేవారెవరో.. పోయే వారెవరో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే.. మాజీ మంత్రి, వరంగల్ జిల్లాలో కీలక నేత అయిన ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ పార్టీని వీడుతారనే టాక్ నడుస్తోంది. ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని బలమైన చర్చ జరుగుతోంది. రేపో మాపో ఆయన కాంగ్రెస్‌లో చేరుతారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు.
ఎర్రబెల్లి స్పందన ఇదీ..
ఇదిలాఉంటే.. పార్టీ మారడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. తాను పార్టీ మారడం లేదని.. అదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు ఎర్రబెల్లి దయాకర్ రావు.