Congress: జిల్లాలకు ఐటీ సేవలు.. కాంగ్రెస్ సర్కార్ కొత్త ప్లాన్
ABN, Publish Date - Sep 28 , 2024 | 08:11 PM
జిల్లాలకు ఐటీ సేవలను విస్తరించాలని కాంగ్రెస్ సర్కార్ ప్రణాళిక రచిస్తోంది. స్టార్టప్ కంపెనీలు జిల్లాలకు వెళ్లే ఆలోచన ఉంటే మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, రాయితీలు ఇస్తామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.
హైదరాబాద్: జిల్లాలకు ఐటీ సేవలను విస్తరించాలని కాంగ్రెస్ సర్కార్ ప్రణాళిక రచిస్తోంది. స్టార్టప్ కంపెనీలు జిల్లాలకు వెళ్లే ఆలోచన ఉంటే మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, రాయితీలు ఇస్తామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో కరీంనగర్‌లో ఐటీ టవర్ నిర్మించినా మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారు.
ALSO READ: TelanganaBhavan: తమ గోడు వెళ్లబోసుకునేందుకు తెలంగాణ భవన్‌కు హైడ్రా బాధితులు
ప్రస్తుతం ఆ ఐటీ టవర్‌లో వివిధ కోర్సులపై శిక్షణ అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏటా 3 వేల మందికిపైగా డిగ్రీ పట్టాలు పొందుతారు. వారందరికీ సరైన శిక్షణ అందించి ఐటీలో రాణించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇలా.. ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరించాలని కాంగ్రెస్ సంకల్పించింది.
సచివాలయంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజస్థాన్, హర్యానా, కర్ణాటక మహారాష్ట్ర పర్యటనలో చేసిన అధ్యయన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం రేవంత్‌రెడ్డికి అధికారులు వివరించారు. అధికారులకు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. కుటుంబ డిజిట్ కార్డులో మహిళనే ఇంటి యజమానిగా గుర్తించాలని అన్నారు. కార్డు వెనుకాల కుటుంబ సభ్యుల పేర్లు వివరాలు పొందుపరచాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
ఒకే కార్డులో రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ ఇతర పథకాల వివరాలు ఉండాలని చెప్పారు. అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా కుటుంబ నిర్ధారణ చేయాలని సూచించారు. అక్టోబర్ 3 నుంచి క్షేత్రస్థాయి పర్యటనలకు అధికారులు వెళ్లాలని చెప్పారు. ప్రతి శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఒక పట్టణం, ఒక గ్రామాన్ని పైలట్‌గా తీసుకోవాలని అన్నారు. ఫ్యామిలీ డిజిట్ కార్డులో పొందుపరచాల్సిన అంశాలను ఆదివారం సాయంత్రంలోగా క్యాబినెట్ సబ్ కమిటీకి అందజేయాలని ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Bandi Sanjay: హైడ్రా తీరుపై స్వయంగా పాట పాడిన బండి సంజయ్
Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదుకు ఆదేశం
TelanganaBhavan: తమ గోడు వెళ్లబోసుకునేందుకు తెలంగాణ భవన్‌కు హైడ్రా బాధితులు
Read Latest Telangana News And Telugu News
Updated at - Sep 28 , 2024 | 08:21 PM