Telangana Geetham: జయ జయహే తెలంగాణ గీతానికి.. కీరవాణి మ్యూజిక్... విడుదల ఎప్పుడంటే..?

ABN, Publish Date - May 21 , 2024 | 04:44 PM

తెలంగాణ రాష్ట్ర గీతంపై (Telangana Geetham) ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. జూన్ 2వ తేదీన ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీతో (Sonia Gandhi) ఈ గీతాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రముఖ కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతానికి కొన్ని మార్పులు చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివిలో ఈ గీతం సిద్ధం అవుతోంది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గీతంపై (Telangana Geetham) ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. జూన్ 2వ తేదీన ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీతో (Sonia Gandhi) ఈ గీతాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రముఖ కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతానికి కొన్ని మార్పులు చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివిలో ఈ గీతం సిద్ధం అవుతోంది. సినీ సంగీత దర్శకుడు కీరవాణితో ఈ పాటను రేవంత్ ప్రభుత్వం కంపోజింగ్ చేయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న.. ఇంతవరకు రాష్ట్రం గీతం లేకుండేది. గతంలో జరిగిన కేబినెట్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.


రాష్ట్ర గీతంలో మార్పులు

తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర గీతం ఉండాలని ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గతంలో అందెశ్రీ రాసిన రాష్ట్ర గీతాన్ని అమోదిస్తూ కేబినెట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణ ఉద్యమం కంటే ముందు ఈ గీతాన్ని రచించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కొన్ని మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందులో భాగంగానే ఆ గీతం రాసిన అందెశ్రీకి కొన్ని మార్పులు చేయాలని ప్రభుత్వం సూచించింది. అందులో భాగంగా అందెశ్రీ ఈ గీతంలో మార్పులు చేసి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం అమోదముద్ర వేసింది. ఆ గీతాన్ని సినీ సంగీత దర్శకుడు కీరవాణితో కంపోజింగ్ చేశారు. జూన్2న రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో.. ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది.


సీఎం రేవంత్ కితాబు..

ఈ కార్యక్రమానికి సోనియా గాంధీని చీఫ్ గెస్ట్‌గా పిలవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నిన్న నిర్వహించిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సోనియాగాంధీ చేతుల మీదుగా తెలంగాణ గీతాన్ని విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. కాసేపటి క్రితమే అందెశ్రీ, కీరవాణి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి తెలంగాణ గీతాన్ని వినిపించారు. ఈ గీతం చాలాబాగుందని రేవంత్ కితాబిచ్చారు. అయిదారు చరణాలతో పూర్తి గీతం ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి రెండు చరణాలను మాత్రమే రాష్ట్రం గీతంగా ప్రకటించారు. ఈ రెండు చరణాల్లో తెలంగాణ అవిర్భావం ఎలా జరిగింది, రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుకొచ్చేలా రాష్ట్ర గీతం ఉండనున్నది. జూన్2న రాష్ట్ర ప్రజలకు అంకితం చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక సమావేశాల సమయాల్లో తెలంగాణ గీతాన్ని ఆలపించే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎఫ్ఐఆర్‌లో సెలబ్రిటీల పేర్లు..

ఆ గ్యాంగ్‌కు రింగ్ మాస్టార్ కాకాణి: సోమిరెడ్డి

వైభవంగా ద్వారకా తిరుమల బ్రహ్మోత్సవాలు..

. సీసీఎస్ ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు

డీజీపీ వాట్సాప్ ఫోటోతో కేటుగాళ్లు సైబర్ ఫ్రాడ్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 21 , 2024 | 04:56 PM