Share News

Viral Video: ఇది తెలివా.. లేక అతి తెలివా.. ఈ పాకిస్థానీయుల నిర్వాకం చూస్తే నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Jan 09 , 2025 | 07:18 PM

కొందరు వాహనాలను చిత్రవిచిత్రంగా ఉపయోగించడం రోజూ చూస్తూనే ఉంటాం. కొందరు బైకులను బావుల వద్ద నీళ్ల మోటార్ల తరహాలో వాడడం చూశాం. అలాగే మరికొందరు ఇదే బైకులతో వ్యవసాయ పొలంలో మట్టి చదును చేసేందుకు వాడడం కూడా చూశాం. ఇలాంటి..

Viral Video: ఇది తెలివా.. లేక అతి తెలివా.. ఈ పాకిస్థానీయుల నిర్వాకం చూస్తే నోరెళ్లబెడతారు..
Pakistani youth running grass machine with bike

కొందరు వాహనాలను చిత్రవిచిత్రంగా ఉపయోగించడం రోజూ చూస్తూనే ఉంటాం. కొందరు బైకులను బావుల వద్ద నీళ్ల మోటార్ల తరహాలో వాడడం చూశాం. అలాగే మరికొందరు ఇదే బైకులతో వ్యవసాయ పొలంలో మట్టి చదును చేసేందుకు వాడడం కూడా చూశాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, పాకిస్థాన్‌కు చెందిన కొందరు యువకులు బైకును వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఇది తెలివా.. లేక అతి తెలివా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పాకిస్థాన్‌కు (Pakistan) చెందిన కొందరు యువకులు తమ బైకును (bike) విచిత్రంగా వాడడం చూసి అంతా అవాక్కవుతున్నారు. వ్యవసాయ పొలంలో గడ్డిని కత్తిరించే యంత్రంలో డీజిల్ అయిపోయి ఆగిపోయింది. దీంతో వారు యంత్రాన్ని నడిపించేందుకు విచిత్ర పద్ధతిని అవలంభించారు.

Viral Video: రూమ్ హీటర్‌ను ఇలాక్కూడా వాడతారా..! ఈమె నిర్వాకం చూస్తే నోరెళ్లబెడతారు..


తమ బైకును గోడ పైకి ఎత్తి పట్టుకుని, దాని వెనుక చక్రాన్ని యంత్రానికి తగిలించారు. బైకు కింద పడకుండా మధ్యలో పెద్ద కర్రను ఉంచి, దాన్ని ఇద్దరు రెండు వైపులా పట్టుకుని నిలబడ్డారు. బైకుపై ఓ వ్యక్తి కూర్చుని రైజ్ చేయగా.. వెనుక టైరు సాయంతో యంత్రం గిరగిరా తిరుగుతూ గడ్డిని కత్తిరిస్తోంది. ఇలా గడ్డి కోసే యంత్రాన్ని విచిత్రంగా నడిపించిన వీరి తెలివిని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: కరవడానికి వచ్చిన కుక్కతో కామెడీ చేయడమంటే ఇదే.. ఈ బైకర్ నిర్వాకం చూస్తే..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బైకుతో ఇంజిన్‌ను నడిపించడం విచిత్రంగా ఉంది’’.., ‘‘దీనికంటే డీజిల్ పోసి ఇంజిన్‌ను వాడడమే బెటర్’’.., ‘‘ఇది మరీ తెలివితక్కువ పని.. ఇలా చేయడం వృథా ప్రయాస’’.., ‘‘వీళ్ల ప్రయోగం చూస్తే ప్రపంచమే షాక్ అయ్యేలా ఉందే’’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5వేలకు పైగా లైక్‌లు, 2 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇందుకే ముంగీసను చూస్తే పాముకు భయం.. ఏం చేసిందో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 09 , 2025 | 08:51 PM