Share News

Nara Lokesh: అప్పనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై లోకేష్‌ను కలిసిన రైతులు

ABN , First Publish Date - 2023-11-27T20:05:03+05:30 IST

అప్పనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ( Appanappalli Lift Irrigation Project ) ను ఒక్క సంవత్సరంలోనే పూర్తిచేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ( CM JAGAN REDDY ) పదవీకాలం పూర్తికావస్తున్నా ఇప్పటికీ పూర్తిచేయలేదని లోకేష్‌కు రైతులు విన్నవించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ ( Nara Lokesh ) ను అప్పనపల్లి గ్రామ రైతులు కలిసి వినతిపత్రం అందజేశారు.

Nara Lokesh: అప్పనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై లోకేష్‌ను కలిసిన రైతులు

రాజోలు: అప్పనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ( Appanappalli Lift Irrigation Project ) ను ఒక్క సంవత్సరంలోనే పూర్తిచేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ( CM JAGAN REDDY ) పదవీకాలం పూర్తికావస్తున్నా ఇప్పటికీ పూర్తిచేయలేదని లోకేష్‌కు రైతులు విన్నవించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ ( Nara Lokesh ) ను అప్పనపల్లి గ్రామ రైతులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లోకేష్‌కు రైతులు సమస్యను విన్నవించారు. అప్పనపల్లి, మానేపల్లి, పెదపట్నం, పెదపట్నంలంక, దొడ్డవరం గ్రామాల్లో తాగునీరు, కొబ్బరి పంటకు సాగునీరు అందడం లేదన్నారు. ఓఎన్జీసీ పైపులైన్లు వల్ల 2వేల ఎకరాల్లోని భూగర్భజలాలు కలుషితమయ్యాయని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుల సమస్యలు పరిష్కరిస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.... టీడీపీ అధికారంలోకి వచ్చాక అప్పనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తిచేసి సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని లోకేశ్ చెప్పారు. లంక గ్రామాలు కోతకు గురికాకుండా రివిట్మెంట్ నిర్మిస్తామన్నారు. కొబ్బరి రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడతాం, ఉపాధి అవకాశాలు పెంచుతామని లోకేష్ పేర్కొన్నారు. బోడసకుర్రు వంతెన వద్దకు లోకేశ్ యువగళం పాదయాత్ర చేరుకున్నది. లోకేశ్‌కు మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. లోకేష్ పాదయాత్రతో బోడసకుర్రు వంతెన జన సంద్రంగా మారింది.

కాగా.. నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) యువగళం పాదయాత్ర దాదాపు రెండున్నర నెలల తర్వాత తిరిగి ప్రారంభమైంది. సోమవారం ఉదయం రాజోలు నియోజకవర్గం పొదలాడలో 210వ రోజు పాదయాత్రను యువనేత మొదలుపెట్టారు.

Updated Date - 2023-11-27T20:20:47+05:30 IST