Central GOVT: 2023 సంవత్సరానికి స్పెషల్ ఆపరేషన్ మెడల్స్ ప్రకటించిన కేంద్ర హోంశాఖ
ABN , First Publish Date - 2023-10-31T13:28:12+05:30 IST
2023 సంవత్సరానికి స్పెషల్ ఆపరేషన్ మెడల్స్ ( Special Operation Medals )ను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సరిహద్దుల రక్షణ, ఆయుధాల నియంత్రణ, మాదకద్రవ్యాల నియంత్రణ వంటి ఆపరేషన్లలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులు, సిబ్బందికి మెడల్స్ అందజేయనుంది.
ఢిల్లీ: 2023 సంవత్సరానికి స్పెషల్ ఆపరేషన్ మెడల్స్ ( Special Operation Medals )ను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సరిహద్దుల రక్షణ, ఆయుధాల నియంత్రణ, మాదకద్రవ్యాల నియంత్రణ వంటి ఆపరేషన్లలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులు, సిబ్బందికి మెడల్స్ అందజేయనుంది. 2018లో స్పెషల్ ఆపరేషన్ మెడల్స్‌ను కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వ విభాగాలతో రాష్ట్రాల్లో 3 నుంచి 5 స్పెషల్ ఆపరేషన్లను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటున్నది. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ నుంచి 12 మందికి, తెలంగాణ నుంచి 14 మందికి కేంద్ర హోం శాఖ మెడల్స్ అందజేయనుంది. ఏపీ నుంచి మెడల్స్ సాధించిన వారిలో వినీత్ బ్రిజ్‌లాల్ (ఐజీ), బాబూజీ అట్టాడ (ఎస్పీ), ఈజీ అశోక్ కుమార్ (నాన్ కేడర్ ఎస్పీ) తదితరులు ఉన్నారు. తెలంగాణ నుంచి రాజేశ్ కుమార్ (ఐజీ), నరేందర్ నారయణ్ రావు చుంగి (ఎస్పీ) తదితరులు మెడల్స్ సాధించారు.