Arvind Kejrival: సీబీఐ దర్యాప్తులో ఏం లభించకపోతే మోదీ రాజీనామా చేస్తారా: అరవింద్ కేజ్రీవాల్

ABN , First Publish Date - 2023-09-28T18:01:44+05:30 IST

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejrival) అధికారిక నివాసం రిపేర్ల కోసం కోట్ల రూపాయలు వృథా చేశారని బీజేపీ(BJP) చేసిన ఆరోపణలతో సీబీఐ(CBI) ప్రాథమిక విచారణ ప్రారంభించింది. ఈ విచారణపై కేజ్రీవాల్ తొలి సారి స్పందించారు. సీబీఐ దర్యాప్తులో ఎలాంటి అక్రమాలు, ఉల్లంఘనలు జరగలేదని తేలితే ప్రధాని తన పదవికి రాజీనామా చేస్తారా? అని కేజ్రీ ప్రశ్నించారు.

Arvind Kejrival: సీబీఐ దర్యాప్తులో ఏం లభించకపోతే మోదీ రాజీనామా చేస్తారా: అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejrival) అధికారిక నివాసం రిపేర్ల కోసం కోట్ల రూపాయలు వృథా చేశారని బీజేపీ(BJP) చేసిన ఆరోపణలతో సీబీఐ(CBI) ప్రాథమిక విచారణ ప్రారంభించింది. ఈ విచారణపై కేజ్రీవాల్ తొలి సారి స్పందించారు. సీబీఐ దర్యాప్తులో ఎలాంటి అక్రమాలు, ఉల్లంఘనలు జరగలేదని తేలితే ప్రధాని తన పదవికి రాజీనామా చేస్తారా? అని కేజ్రీ ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థ విచారణను స్వాగతిస్తున్నట్లు కేజ్రీ చెప్పారు. తనపై విచారణ జరగడం ఇదే తొలిసారి కాదని, ఎన్ని బూటకపు విచారణలు చేపట్టినా తాను తలొగ్గబోనని స్పష్టం చేశారు.


ప్రధాని మోదీ విచారణ పేరుతో మభ్యపెడుతూ ఆందోళన చెందుతున్నారని.. ఢిల్లీ మద్యం కేసు నుంచి ఆ పార్టీ వైఖరి ఇలాగే ఉందని ఆక్షేపించారు. ఇప్పటి వరకు తనపై 33కి పైగా కేసులు నమోదు చేశారని 8 ఏళ్లుగా వారు ఏమీ కనుక్కోలేదని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం తన అధికార నివాస పునరుద్ధరణకు రూ.45 కోట్లు ఖర్చు చేసిందని బీజేపీ చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణకు(Preliminary Enquiry) కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించిన మరుసటి రోజు కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. టెండర్ డాక్యుమెంట్లు, బిడ్లు, నిర్మాణ అనుమతులు తదితర వివరాలు సీబీఐ అధికారులు అడిగినట్లు సమాచారం. ఈ చర్యలను ఆప్(AAP) ఖండించింది. తమ పార్టీని అంతమొందించేందుకే బీజేపీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇలాంటి పనులు చేస్తోందని ఆరోపించింది.

Updated Date - 2023-09-28T18:01:44+05:30 IST