Share News

TS Elections : బీఆర్ఎస్‌కు ఝలక్.. సీన్ రివర్స్ అయ్యిందే..!?

ABN , First Publish Date - 2023-11-14T19:29:36+05:30 IST

Telangana Assembly Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Polls) ముందు అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. హ్యాట్రిక్ కొట్టి తీరాల్సిందేనని విశ్వప్రయత్నాలు చేస్తున్న గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌కు (CM KCR) ఊహించని షాక్‌లే తగులుతున్నాయి...

TS Elections : బీఆర్ఎస్‌కు ఝలక్.. సీన్ రివర్స్ అయ్యిందే..!?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Polls) ముందు అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. హ్యాట్రిక్ కొట్టి తీరాల్సిందేనని విశ్వప్రయత్నాలు చేస్తున్న గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌కు (CM KCR) ఊహించని షాక్‌లే తగులుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్‌లోని (BRS) అసంతృప్తులు, టికెట్లు దక్కని సిట్టింగ్‌లు కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో హస్తం (Congress) పార్టీ హౌస్‌ఫుల్ అయ్యింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో (Khammam) పాగా వేయాలని వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఒక మాజీ మంత్రి, పలువురు సీనియర్ నేతలు, యువనేతను బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు కేసీఆర్. వీరంతా ఎమ్మెల్యే అభ్యర్థులకు, కీలక నేత అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి (Ponguleti Srinivasa Reddy) ప్రధాన అనుచరులే.. దీంతో సమయం, సందర్భం కోసం వేచి చూసిన కాంగ్రెస్.. బీఆర్ఎస్‌ను (Congress, BRS) గట్టిగానే దెబ్బకొట్టింది. అధికార పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు దృష్టిపెట్టారు.


TG-Map-and-Parties.jpg

ఇదీ అసలు కథ!

వాస్తవానికి ఖమ్మంలో బీఆర్ఎస్‌కు బలం తక్కువేనన్నది సొంత పార్టీ నేతలు చెబుతున్న మాట. మరీ ముఖ్యంగా.. కీలక నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ముందు.. ఆ తర్వాత ప్రత్యేక సమావేశాలు పెట్టి మరీ పార్టీ బలోపేతం, గెలుపు కోసం చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు. కాస్తో కూస్తో కారు పార్టీ కోలుకుంటోందనుకున్న టైమ్‌లో కాంగ్రెస్ ఊహించని దెబ్బ కొట్టింది. ఖమ్మం డిప్యూటీ మేయర్ ఫాతిమా బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఆమె భర్త ముక్తార్ సుడా డైరెక్టర్‌గా, నగర మైనారిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ ఇద్దరూ రాజీనామా చేసి.. సీనియర్ నేత తుమ్మల సమక్షంలో ఫాతిమా దంపతులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. చేరిక అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ అంటే బీజేపీ అని విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. బీఆర్ఎస్-బీజేపీ-ఎంఐఎం ఒక్కటేనన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మైనార్టీలు బలంగా నమ్ముతున్నారని చెప్పుకొచ్చారు.

Khammam-Fatima.jpg

తరిమికొడదాం..!

ఈ చేరిక అనంతరం తుమ్మల మీడియాతో మాట్లాడుతూ.. తన హయంలో కార్పొరేటర్‌లు గౌరవ మర్యాదలతో ఉన్నారన్నారు. ‘ప్రజా ప్రతినిధులైన కార్పొరేటర్లను పీడించి, అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. గెలిపించిన ప్రజల అభీష్టం మేరకే కార్పొరేటర్లు బీ ఆర్ ఎస్ పార్టీ ని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఖమ్మంలో అరాచక అవినీతి పాలనను తరిమికొట్టాలి. ప్రజలు సుపరిపాలన కోరుకుంటున్నారు.. ఇక్కడ మాత్రం అవినీతి పాలన జరుగుతోంది’ అని తుమ్మల చెప్పుకొచ్చారు. కాగా.. ఇటీవలే మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, పీసీసీ అధ్యక్షుడి అత్యంత సన్నిహితుడు, విద్యార్థినేతగా పేరున్న కూటూరి మానవతారాయ్, టీపీసీసి ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి కృష్ణ, సీనియర్ రాజకీయ నేత వూకె అబ్బయ్య దంపతులు, డా. రామచంద్రు నాయక్.. వీరితో పాటు పలువురు సీనియర్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో కౌంటర్ ప్లాన్ చేసిన కాంగ్రెస్.. ఇవాళ డిప్యూటీ మేయర్‌ను పార్టీలో చేర్చుకుంది. త్వరలో జిల్లాలో ఒకరిద్దరు పెద్ద తలకాయలు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని వార్తలు గుప్పుమంటున్నాయి.

Khammam-BRS.jpg

TS Assembly Polls : ఆఖరి నిమిషంలో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టిన కేసీఆర్!!


Updated Date - 2023-11-14T20:23:47+05:30 IST