Share News

Shocking: 32 ఏళ్ల ఆ మహిళ బాత్రూంలోనే ఎలా చనిపోయింది..? పోస్ట్‌మార్టం రిపోర్టుతో వీడిన డెత్ మిస్టరీ.. ఏం తేల్చారంటే..!

ABN , First Publish Date - 2023-11-09T20:55:45+05:30 IST

కొన్నిసార్లు కొందరి మరణానికి గల కారణాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అందరిముందూ సంతోషంగా డాన్సులు వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయేవారు కొందరైతే.. ఇంకొన్నిసార్లు కూర్చున్నవారు కూర్చున్నట్లు.. నిద్రలో ఉన్న వారు నిద్రలోనే ప్రాణాలు వదలడం చూస్తూ ఉంటాం. తాజాగా...

Shocking: 32 ఏళ్ల ఆ మహిళ బాత్రూంలోనే ఎలా చనిపోయింది..? పోస్ట్‌మార్టం రిపోర్టుతో వీడిన డెత్ మిస్టరీ.. ఏం తేల్చారంటే..!
ప్రతీకాత్మక చిత్రం

కొన్నిసార్లు కొందరి మరణానికి గల కారణాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అందరిముందూ సంతోషంగా డాన్సులు వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయేవారు కొందరైతే.. ఇంకొన్నిసార్లు కూర్చున్నవారు కూర్చున్నట్లు.. నిద్రలో ఉన్న వారు నిద్రలోనే ప్రాణాలు వదలడం చూస్తూ ఉంటాం. తాజాగా, ఢిల్లీలో ఓ మహిళ విచిత్ర పరిస్థితుల్లో చనిపోయింది. స్నానానికని వెళ్లిన ఆమె ఎంతకీ బయటికి రాలేదు. అనుమానం వచ్చి తలుపులు బద్దలుకొట్టి చూడగా చలనం లేకుండా పడిపోయింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చివరకు పోస్టుమార్టం రిపోర్టులో ఏం తేలిందంటే..

ఢిల్లీలోని (Delhi) మధు విహార్ ప్రాంత పరిధి నీల్ కాంత్ అపార్ట్‌మెంట్‍‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ అపార్ట్‌మెంట్‍‌లో నివాసం ఉండే పూజ (32) అనే మహిళ ఒంటరిగా నివాసం ఉంటోంది. మధు విహార్ ప్రాంతంలోని ఓ ఫొటో స్టూడియోలో (woman working as photographer) ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తుండేది. ఇదిలావుండగా, మంగళవారం యథావిధిగా స్టూడియోకు వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో స్నానం చేసేందుకు బాత్‌రూంకి వెళ్లింది. అయితే లోపలికి వెళ్లిన ఆమె తిరిగి బయటికి రాలేదు. ఫొటో స్టూడియోకి ఎంతకీ ఆమె రాకపోవడంతో స్నేహితుడు ఫోన్ చేశాడు. అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం కలిగింది. ఏమైందో చూద్దామని నేరుగా పూజ ఇంటికి వెళ్లాడు. లోపల ఎక్కడ వెతికినా ఆమె కనిపించలేదు.

OYO Rooms: ఓయో రూమ్‌ నుంచి ఎంతకూ బయటకు రాని ప్రేమ జంట.. ఎన్నిసార్లు పిలిచినా నో రెస్పాన్స్.. తలుపులు పగలగొట్టి చూస్తే..!

చివరకు బాత్రూంలో ఉన్నట్లు తెలిసింది. అయితే ఎంత పిలిచినా స్సందన లేకపోవడంతో చివరకు తలుపులు పగులగొట్టి వెళ్లారు. లోపలికి వెళ్లి చూస్తే ఆమె (woman fell unconscious in Bathroom) అపస్మారక స్థితిలో పడి ఉంది. దీంతో వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందిందని చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రక్తపోటు (high blood pressure) ఎక్కువ అవడంతోనే పూజ మృతి చెందిందని పోస్టుమార్టంలో తేలినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Indian Railway: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాదండోయ్.. రైల్వే శాఖకు కాసులు కురిపిస్తున్న 5 ట్రైన్ల లిస్ట్ ఇదే..!

Updated Date - 2023-11-09T20:56:23+05:30 IST