Share News

Viral Video: చెవిలో దురదతో ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. లోపల ఏముందా అని పరిశీలించిన వైద్యులకు దిమ్మతిరిగే షాక్..

ABN , First Publish Date - 2023-10-28T14:38:53+05:30 IST

కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్తే.. చివరకు లోపలి నుంచి వెంట్రుకలు, ఇనుప వస్తువులు తదితరాలు బయటపడడం చూస్తూనే ఉంటాం. చివరకు చెవి నుంచి పామును బయటికి తీసిన సందర్భాలను కూడా చూశాం. ఇలాంటి ...

Viral Video: చెవిలో దురదతో ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. లోపల ఏముందా అని పరిశీలించిన వైద్యులకు దిమ్మతిరిగే షాక్..

కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్తే.. చివరకు లోపలి నుంచి వెంట్రుకలు, ఇనుప వస్తువులు తదితరాలు బయటపడడం చూస్తూనే ఉంటాం. చివరకు చెవి నుంచి పామును బయటికి తీసిన సందర్భాలను కూడా చూశాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. చెవిలో దురద, నొప్పి వస్తుండడంతో ఓ మహిళ.. వైద్యుడి వద్దకు వెళ్లింది. పరీక్షించిన వైద్యులు చివరకు చెవిలో ఉన్న జీవిని చూసి షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

తైవాన్‌లో (Taiwan) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 64 ఏళ్ల మహిళకు.. కొన్నాళ్లుగా చెవి నొప్పితో (woman suffering from Ear pain) పాటూ లోపలి నుంచి వింత వింత శబ్ధాలు వస్తుండేవి. దీంతో ఆమె పలుమార్లు ఇంటి వైద్యం చేసి చూసింది. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు చేసేదేమీలేక వైద్యుడిని సంప్రదించింది. డాక్టర్ పరిశీలించగా.. లోపల షాకింగ్ దృశ్యం కనిపించింది. మహిళ చెవిలో ప్రాణంతో (Spider was found in ear) ఉన్న సాలీడు పురుగులను చూసి వైద్యుడు ఖంగుతిన్నాడు. చివరకు ట్యూబ్ సాయంతో సాలీడును బయటికి తీశాడు.

Viral Video: దాదాపు సగం చచ్చిపోయిన పామును చూసిన పోలీసు.. చివరకు ఒకే ఒక్క పని చేసి ఎలా బతికించాడంటే..

చెవికి ఎలాంటి నష్టం జరగలేదని చెప్పడంతో మహిళ హమ్మయ్య! అంటూ ఊపిరి పీల్చుకుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘నాకూ ఇలాగే జరిగింది.. అయితే చెవిలో నీళ్లు పోసి విదిలించడంతో బయటికి వచ్చేసింది’’.., ‘‘స్పైడర్మ్యాన్ ఎండ్ ఆఫ్ ది టన్నెల్’’.., ‘‘ఈమె చెవిలో కొత్త ఉచ్చు వేయబడుతోంది’’.., ‘‘స్పైడర్ ఉమన్’’.., ‘‘ఈమె చెవులు ఇంత శుభ్రంగా ఎలా ఉన్నాయి’’.., ‘‘ఇలాంటి సీన్ ఎప్పుడూ చూడలేదు’’.. అంటూ ఒక్కొక్కరు ఒక్కోలా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు.

Crime news: పుట్టిన రోజున తల్లి, ఆమె ప్రియుడితో కలిసి అర్ధరాత్రి కేక్ కట్ చేసిన బాలిక.. ఉదయం స్థానికులు వెళ్లి చూడగా షాకింగ్ సీన్..

Updated Date - 2023-10-28T14:38:53+05:30 IST