Husband: రాఖీ పండుగకు పుట్టింటికి వెళ్లిన భార్య.. తిరిగొచ్చేసరికి ఈ భర్త ఇలా చేశాడేంటి..? ఇంటి తలుపులు తీసి చూస్తే..!

ABN , First Publish Date - 2023-09-05T15:09:24+05:30 IST

ఎలాంటి కుటుంబంలోనైనా నిత్యం ఏదో ఒక సమస్యతో దంపతులు ఇబ్బందులు పడుతుంటారు. కొందరు దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకోలేక గొడవలు పడుతుంటే.. ఇంట్లో అన్నీ సక్రమంగా ఉన్నా బయటి సమస్యలతో మరికొందరు దంపతులు సతమతమవుతుంటారు. ఈ క్రమంలో కొందరు..

Husband: రాఖీ పండుగకు పుట్టింటికి వెళ్లిన భార్య.. తిరిగొచ్చేసరికి ఈ భర్త ఇలా చేశాడేంటి..? ఇంటి తలుపులు తీసి చూస్తే..!
ప్రతీకాత్మక చిత్రం

ఎలాంటి కుటుంబంలోనైనా నిత్యం ఏదో ఒక సమస్యతో దంపతులు ఇబ్బందులు పడుతుంటారు. కొందరు దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకోలేక గొడవలు పడుతుంటే.. ఇంట్లో అన్నీ సక్రమంగా ఉన్నా బయటి సమస్యలతో మరికొందరు దంపతులు సతమతమవుతుంటారు. ఈ క్రమంలో కొందరు సమస్యలను అదిగమించి నిలదొక్కుకుంటుంటే.. మరికొందరు అనూహ్య నిర్ణయాలు తీసుకుని, జీవితాలను ముగించేస్తుంటారు. తాజాగా, రాజస్థాన్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. రాఖీ పండుగకు పుట్టింటికి వెళ్లిన భార్య.. తిరిగొచ్చి తలుపులు తీసి ఇంట్లోకి వెళ్లి చూడగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్ (Rajasthan) కోట నగర పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక డిగోడ్ పోలీస్ స్టేషన్ పరిధి కాక్రవాడ గ్రామానికి చెందిన రామ్ గోపాల్ (45) అనే వ్యక్తి.. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. రామ్ గోపాల్ వ్యవసాయం (agriculture) చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే రెండు, మూడేళ్లుగా సరైన వర్షాలు లేని కారణంగా వ్యవసాయంలో తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నాడు. దీంతో రామ్ గోపాల్ అప్పులపాలయ్యాడు. ఎలాగైనా పాత అప్పులన్నీ తీరిపోవాలనే ఉద్దేశంతో ఈ ఏడాది చాలా ఖర్చు చేసి సోయాబీన్ పంట సాగు (soybean crop) చేశాడు. అయితే ఈ ఏడాది కూడా వరణుడు కరుణ చూపలేదు. దీంతో రామ గోపాల్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. కొన్నాళ్లుగా ఇతను తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతూ వస్తున్నాడు.

Crime news: రోడ్డు పక్కన పొదల మధ్య బయటపడ్డ ఇనుప పెట్టె.. అందులో ఏముందా అని భయం భయంగా వెళ్లి తెరచి చూస్తే..

man-crime.jpg

ఈ క్రమంలో రాఖీ పండుగ (Rakhi festival) సందర్భంగా ఆగస్టు 30న రామ్ గోపాల్ భార్య.. తన పిల్లలను తీసుకుని సోదరులకు రాఖీ కట్టేందుకు పుట్టింటికి వెళ్లింది. మరుసటి రోజు తిరిగి వచ్చిన ఆమెకు.. ఇంటి తలుపులు మూసి ఉండడం కనిపించింది. తెరచి లోపలి వెళ్లగా భర్త ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కొన్ని గంటల ముందు తనతో మాట్లాడిన భర్త.. ఇలా మృత్యువాత పడడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. భర్త మృతదేహంపై పడి బోరున విలపించింది. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. రాజస్థాన్‌లోని 90శాతం ప్రాంతాల్లో గత మూడు, నాలుగు వారాలుగా తీవ్ర వర్షాభావం నెలకొంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

Tiger Attack: కారులో కూర్చున్నాం కదా.. ఏమీకాదనే ధీమాతో ఉండగా.. ఎగిరొచ్చిన పులి ఏం చేసిందో చూడండి..

Updated Date - 2023-09-05T15:11:07+05:30 IST