Tiger Attack: కారులో కూర్చున్నాం కదా.. ఏమీకాదనే ధీమాతో ఉండగా.. ఎగిరొచ్చిన పులి ఏం చేసిందో చూడండి..

ABN , First Publish Date - 2023-09-03T18:42:56+05:30 IST

‘‘బోనులో ఉన్నా.. బయట ఉన్నా పులి పులే’’.. అని ఓ సినీ కవి అన్నట్లుగా.. పులులు, సింహాలతో చెలగాటం ప్రాణాలకే ప్రమాదం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొందరు జూలలోని సింహాలు, పులులతో తమాషా చేసి, చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలను...

Tiger Attack: కారులో కూర్చున్నాం కదా.. ఏమీకాదనే ధీమాతో ఉండగా.. ఎగిరొచ్చిన పులి ఏం చేసిందో చూడండి..

‘‘బోనులో ఉన్నా.. బయట ఉన్నా పులి పులే’’.. అని ఓ సినీ కవి అన్నట్లుగా.. పులులు, సింహాలతో చెలగాటం ప్రాణాలకే ప్రమాదం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొందరు జూలలోని సింహాలు, పులులతో తమాషా చేసి, చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలను చాలా చూశాం. కొన్నిసార్లు జనావాసాల్లోకి చొరబడే క్రూరమృగాలు బీభత్సం సృష్టించడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు దురదృష్టవశాత్తు ఎందరో ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. అయితే కొన్నిసార్లు అదృష్టం బాగుండి క్షేమంగా బయటపడుతుంటారు. ఇలాంటి సందర్భాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వాహనాల మీదకు దూసుకొచ్చిన పులిని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ చిరుత పులి జనావాసాల్లోకి చొరబడుతుంది. ఎటు వెళ్లాలో అర్థం కాక ఓ పెద్ద బిల్డింగ్ లోకి దూరుతుంది. అయితే అప్పటికే అక్కడ గుమికూడిన జనం కేకలు పెట్టడంతో పులి మరింత కంగారు పడుతుంది. ఈలోగా భవనం పక్కనే ఉన్న రోడ్డుపై వాహనాలన్నీ ఆగి ఉంటాయి. పులి వచ్చిందనే సమాచారంతో అంతా భయం భయంగా డోర్లు వేసుకుని, వాహనాల్లో కూర్చుని ఉంటారు. భవనం అవతల ఉన్న పులి.. బయటికి వచ్చే క్రమంలో వాహనాలను టార్గెట్ చేస్తోంది. అప్పటికే ఆవేశంతో ఉన్న చిరుత వేగంగా ఒక్క జంప్ చేసి ప్రహరీని దాటుకుని నేరుగా వచ్చి (tiger jumped on the van) ఓ వ్యాన్‌ మీదకు దూకుతుంది.

School boys: చూసేందుకు వీళ్లు చేస్తోంది అల్లరే అయినా.. అందులో దాగున్న వారి ట్యాలెంట్ చూస్తే.. చప్పట్లు కొట్టాల్సిందే..

పులి రావడం చూసి భయపడిపోయిన వ్యాన్ డ్రైవర్ డోర్ గ్లాసులు మూసేసి కారును ఆపుకొని ఉంటాడు. వ్యాన్ ఇంజిన్ మీదకు దూకిన పులి.. డోర్ గ్లాసు బద్ధలుకొట్టాలని చూస్తుంది. అయితే డ్రైవర్ వ్యాన్‌ను ముందుకు పోనివ్వడంతో.. కిందకు దూకిన పులి అక్కడి నుంచి పారిపోతుంది. ఈ ఘటనలో అక్కడున్న వారికి ఎలాంటి ప్రమాదమూ జరక్కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనను కారులో ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో! కారు డోరు గ్లాసు తీసి ఉంటే.. పరిస్థితి ఏంటో’’.. అని కొందరు, ‘‘ఇది చాలా భయానకంగా ఉంది బాబోయ్’’.. అని మరికొందరు, ‘‘థ్యాంక్స్ గాడ్.. ఎవరికీ ఏమీ కాలేదు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 36వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Crime news: డబ్బు సంపాదనకు భార్యాభర్తల వెరైటీ ప్లాన్.. వారి బెడ్రూంలోని బల్బ్ హోల్డర్‌ను విప్పి చూసిన పోలీసులకు దిమ్మతిరిగే షాక్..

Updated Date - 2023-09-03T18:42:56+05:30 IST