Viral Video: వామ్మో! ఇదెక్కడి డ్రైవింగ్‌రా బాబోయ్.. రోడ్డుపై ఎంత ట్రాఫిక్ ఉంటే మాత్రం.. ఏ ఆటో డ్రైవరైనా ఇలా చేస్తాడా..

ABN , First Publish Date - 2023-09-03T19:47:19+05:30 IST

పట్టణాలు, నగరాల్లో ట్రాఫిక్ జామ్ అయిన సందర్భంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో కొందరు వాహనాదారులు ఎలాగైనా ట్రాఫిక్ నుంచి బయటపడేందుకు చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. ఇక ద్విచక్రవాహనదారులైతే.. ఫుట్‌పాత్‌ల పైకి ఎక్కి మరీ...

Viral Video: వామ్మో! ఇదెక్కడి డ్రైవింగ్‌రా బాబోయ్.. రోడ్డుపై ఎంత ట్రాఫిక్ ఉంటే మాత్రం.. ఏ ఆటో డ్రైవరైనా ఇలా చేస్తాడా..

పట్టణాలు, నగరాల్లో ట్రాఫిక్ జామ్ అయిన సందర్భంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో కొందరు వాహనాదారులు ఎలాగైనా ట్రాఫిక్ నుంచి బయటపడేందుకు చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. ఇక ద్విచక్రవాహనదారులైతే.. ఫుట్‌పాత్‌ల పైకి ఎక్కి మరీ అడ్డదిడ్డంగా వెళ్లిపోతుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ ఆటో డ్రైవర్ చేసిన పనికి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఇదెక్కడి డ్రైవింగ్‌రా బాబోయ్’’.. అని కామెంట్లు చేస్తున్నారు.

ఢిల్లీలోని (Delhi) హమ్దర్ద్ నగర్ రెడ్ లైట్ సంగమ్ విహార్ ట్రాఫిక్ సర్కిల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సాధారణంగానే ఢిల్లీలో ట్రాఫిక్ సమస్య (Traffic problem) విపరీతంగా ఉంటుంది. ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనదారులు నిత్యం అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. తాజాగా, విహార్ ట్రాఫిక్ సర్కిల్ వద్ద ఆదివారం కూడా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనాలు కిలోమీటర్ల మేర బారులుతీరాయి. చాలా మంది అటు ముందుకు వెళ్లలేక, ఇటు వెనక్కు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో అంతా అవాక్కయ్యే సంఘటన చోటు చేసుకుంది. ట్రాఫిక్‌లో గంటల తరబడి వేచి చూసి.. ఆటో డ్రైవర్‌కు (Auto driver) విపరీతమైన కోపం వచ్చినట్లుంది. ఎలాగైనా అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకున్నాడు.

Tiger Attack: కారులో కూర్చున్నాం కదా.. ఏమీకాదనే ధీమాతో ఉండగా.. ఎగిరొచ్చిన పులి ఏం చేసిందో చూడండి..

అయితే అది సాధ్యం కాకపోవడంతో చివరికి ఏకంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి పైకే (Foot over bridge) ఎక్కించేశాడు. పక్కన ఉన్న వారి సాయంతో ముందుగా మెల్లగా ఆటోను మెట్ల పైకి ఎక్కించేశాడు. తర్వాత క్రమ క్రమంగా స్పీడు పెంచుతూ బ్రిడ్జి పైకి వెళ్లిపోయాడు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి పైకి ఆటో ఎక్కడం చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. అక్కడే ఉన్న వారంతా ఈ ఘటనను తమ ఫోన్లలో రికార్డు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘అది ఆటో అనుకున్నావా.. లేక హెలీకాప్టర్ అనుకున్నావా’’.. అని కొందరు, ‘‘ఇతడి మామూలు డ్రైవర్ కాదు బాబోయ్’’.. అని మరికొందరు, ‘‘ఇది కదా డ్రైవింగ్ అంటే’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 29వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Crime news: డబ్బు సంపాదనకు భార్యాభర్తల వెరైటీ ప్లాన్.. వారి బెడ్రూంలోని బల్బ్ హోల్డర్‌ను విప్పి చూసిన పోలీసులకు దిమ్మతిరిగే షాక్..

Updated Date - 2023-09-03T19:47:19+05:30 IST