Viral Video: మిరాకిల్ అంటే ఇదేనేమో.. అంతెత్తు నుంచి పడిపోయిన చిన్నారి.. ఆ వెంటనే ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2023-04-27T17:25:05+05:30 IST

పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినా కొన్నిసార్లు.. కొందరు చిన్న గాయం కూడా కాకుండా క్షేమంగా బయటపడుతుంటారు. ఇలాంటి మిరాకిల్ ఘటనలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం..

Viral Video: మిరాకిల్ అంటే ఇదేనేమో.. అంతెత్తు నుంచి పడిపోయిన చిన్నారి.. ఆ వెంటనే ఏం చేసిందంటే..

పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినా కొన్నిసార్లు.. కొందరు చిన్న గాయం కూడా కాకుండా క్షేమంగా బయటపడుతుంటారు. ఇలాంటి మిరాకిల్ ఘటనలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ చిన్నారికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆడుకుంటున్న ఓ చిన్నారి మేడ పైనుంచి అమాంతం కిందపడిపోతుంది. చివరకు అంతా ఆశ్చర్యపోయేలా చిన్నారి పైకి లేచి నిలబడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు చిన్నారి ఎంతో అదృష్టవంతురాలు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మహారాష్ట్ర (Maharashtra) వాషిమ్ జిల్లా పరిధి రిసోడ్ పట్టణంలోని మహానంద కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటి ముందు రెండు బైకులు (Parked bikes) పార్క్ చేసి ఉంటాయి. ఆ ఇంటిపై 30 అడుగుల ఎత్తులో ఓ చిన్నారి (girl) ఆడుకుంటూ ఉంటుంది. అయితే ఆ సమయంలో చిన్నారి తల్లిదండ్రులు ఏమరపాటులో ఉన్నారో ఏమో తెలీదు గానీ.. ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఆడుకుంటున్న చిన్నారి అనుకోకుండా పైనుంచి అమాంతం (child fell from the top) కిందపడిపోతుంది. అయితే అదృష్టం బాగుండి నేరుగా పార్క్ చేసిన బైకు సీటుపై పడి చివరకు నేలపై పడిపోతుంది.

Viral Vdeo: ఆకలితో ఉన్న పులిని కెలికారు.. చివరకు వాహనం మీదకు ఎలా వచ్చిందో చూడండి..

బైకు సీటుపై పడడంతో పాపకు ఎలాంటి గాయాలూ కాలేదు. కింద పడ్డ పాప వెంటనే పైకి లేచి, ఏడుస్తూ నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోతుంది. ఆ సమయంలో అక్కడ బైకు లేకుంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఊహించని ఘటనలో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే చిన్నారికి ఎలాంటి గాయాలూ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో (CC camera videos) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral News: ఈ వ్యభిచారాన్ని వదిలెయ్.. నిన్ను పెళ్లి చేసుకుంటా.. హోటల్‌లో కలిసిన 20 ఏళ్ల వేశ్యకు ఓ కుర్రాడి ఆఫర్.. చివరకు..!

Updated Date - 2023-04-28T21:03:36+05:30 IST