Viral Video: డాక్టర్ అవతారం ఎత్తిన గొరిల్లా.. గాయపడిన పక్షిని ఎలా పరిశీలిస్తోందో చూస్తే అవాక్కవుతారు..
ABN , Publish Date - Dec 22 , 2023 | 06:54 PM
మనుషులను అనుకరించడంలో చింపాజీ, గొరిల్లాలు మించిన జంతువులు మరోటి ఉండవంటే అతిశయోక్తి లేదు. కొన్నిసార్లు వీటి ప్రవర్తన చూస్తే అచ్చం మనుషుల తరహాలోనే ఉంటుంది. బట్టలు ఉతకడం, వాహనాలు శుభ్రం చేయడం, డాన్సులు చేయడం తదితర...
మనుషులను అనుకరించడంలో చింపాజీ, గొరిల్లాలు మించిన జంతువులు మరోటి ఉండవంటే అతిశయోక్తి లేదు. కొన్నిసార్లు వీటి ప్రవర్తన చూస్తే అచ్చం మనుషుల తరహాలోనే ఉంటుంది. బట్టలు ఉతకడం, వాహనాలు శుభ్రం చేయడం, డాన్సులు చేయడం తదితర కార్యకలాపాలను మక్కీకి మక్కీ దించేస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ గొరిల్లాకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. డాక్టర్ అవతారం ఎత్తిన గొరిల్లా.. గాయపడిన పక్షిని పరిశీలించడం చూసి నెటిజన్లు అవాక్కవుతన్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పార్క్‌లో గాయపడిన పక్షి.. గొరిల్లా (gorilla) ఎన్‌క్లోజర్‌లో పడిపోయింది. తీవ్రంగా గాయపడడంతో గాల్లోకి లేవలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. దూరంలో ఉన్న గొరిల్లా పక్షిని గమనించి వేగంగా దగ్గరికి వస్తుంది. ‘‘అయ్యో! పాపం పక్షికి ఇలా అయ్యిందేంటీ’’.. అన్నట్లుగా దాని వద్దకు వచ్చి.. ముందుగా దూరం నుంచి గమనిస్తుంది. తర్వాత తన మూతిని పక్షి దగ్గరగా పెట్టి పరిశీలిస్తుంది. ఆ తర్వాత ఎంతో ప్రేమతో (gorilla kisses an injured bird) పక్షిని ముద్దాడుతుంది. చివరగా పక్షి పరిస్థితి తెలుసుకునేందుకు చేతులతో మెల్లగా కదిలిస్తుంది.
Viral Video: మొసలి నోట్లో నుంచి ప్రాణాలతో బయటికొచ్చిన వ్యక్తి.. అయితే కాస్త తీక్షణంగా పరిశీలించగా..
పక్షి కదలగానే పైకి లేపాలనే ఉద్దేశంతో అటూ ఇటూ తిప్పుతూ కదుపుతుంది. అయినా పక్షి రెక్కలు ఆడిస్తుంది గానీ పైకి లేవలేకపోతుంది. అయినా గొరిల్లా మాత్రం చాలా సేపు పక్షిని కాపాడే ప్రయత్నం చేస్తుంది. చివరగా నడవలేకపోతున్న పక్షిని పట్టుకుని నడిపించే ప్రయత్నం చేస్తుంది. ఇలా చాలా సేపు పక్షి వద్దే కూర్చుని కాలక్షేపం చేస్తుంది. అయినా దానికి చిన్న గాయం కూడా చేయకుండా తన మంచి మనసును చాటుకుంటుంది. గొరిల్లాను చూసి మురిసిపోయిన పర్యాటకులు.. వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ గొరిల్లా ఎంత మంచిదో’’.. అంటూ కొందరు, ‘‘పక్షికి బాగానే ట్రైనింగ్ ఇస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.