Share News

Viral Video: ప్రీ వెడ్డింగ్ షూట్‌లో వరుడికి వధువు ముద్దు పెడుతుండగా షాకిచ్చిన పాము.. ఉన్నట్టుండి మధ్యలోకి దూసుకురావడంతో..

ABN , Publish Date - Dec 22 , 2023 | 03:01 PM

ఇటీవలి రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ పెళ్లి ఎంత ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నారో.. ఫ్రీ వెడ్డింగ్ షూట్ కూడా అంతే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడడం లేదు. కొన్ని ప్రీ వెడ్డింగ్ షూట్‌లను చూస్తే..

Viral Video: ప్రీ వెడ్డింగ్ షూట్‌లో వరుడికి వధువు ముద్దు పెడుతుండగా షాకిచ్చిన పాము.. ఉన్నట్టుండి మధ్యలోకి దూసుకురావడంతో..

ఇటీవలి రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ పెళ్లి ఎంత ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నారో.. ఫ్రీ వెడ్డింగ్ షూట్ కూడా అంతే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడడం లేదు. కొన్ని ప్రీ వెడ్డింగ్ షూట్‌లను చూస్తే.. సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటున్నాయి. అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా.. కొన్నిసార్లు ఇలాంటి సమయాల్లో అనుకోని సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. తాజాగా, ఓ జంట విషయంలో ఇలాగే జరిగింది. నూతన వధూవరులు తమ ప్రీ వెడ్డింగ్ షూట్‌ను నీళ్లలో ప్లాన్ చేసుకున్నారు. అయితే మధ్యలో ఉన్నట్టుండి ఓ పాము వారి మధ్యకు దూసుకొచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

కొంకణ్ (Konkan) ప్రాంతంలోని ఓ అందమైన లొకేషన్‌లో ఓ జంట తమ ప్రీ వెడ్డింగ్ షూట్ (Pre wedding shoot) ప్లాన్ చేసుకుంది. ఫొటోగ్రాఫర్ల ప్లాన్ ప్రకారం.. సదరు జంట నీటిలో ఉండగా.. పైన పొగలు వ్యాపించినట్లుగా ఉండాలి. ఇందుకోసం కావాల్సిన వస్తువులన్నీ సిద్ధం చేసుకుని, రాత్రి వేళ షూటింగ్ స్టార్ట్ చేశారు. ముందుగా వధూవరులను (bride and groom) నీటిలోకి దింపారు. వారు నీటిలో కూర్చుని ఉండగా.. చుట్టూ ఉన్న వారు పౌడర్‌ను నీటిలో చల్లగా.. చూస్తుండగానే నీటిపై పొగలు వ్యాపించాయి. ఆ పొగల మధ్యలో వరుడికి వధువు ముద్దు పెడుతుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు సమస్య ఎదురైంది.

Viral Video: బంధువులతో సరదాగా మాట్లాడుతున్న వధూవరులు.. ఇంతలో ఉన్నట్టుండి వీరిపై విధి ఎలా పగబట్టిందంటే..

ఓ పాము పొగల మధ్యలో నుంచి వధూవరుల వద్దకు నీటిలో కొట్టుకుంటూ వచ్చింది. తీరా వారి వద్దకు రాగానే వెనక్కు తిరికి మరీ.. వారి సమీపానికి వెళ్లింది. పామును చూసిన వారంతా ఎలాంటి కంగారు పడకుండా ఎక్కడివారు అక్కడే సైలెంట్‌గా ఉన్నారు. వరుడు కూడా పామును చూసి.. దారి దారిన అదే పోతుందిలే.. అని అనుకుంటూ మిన్నకుండిపోయాడు. వధూవరుల మధ్యలోకి వెళ్లిన పాము.. అటు నుంచి అటే దూరంగా వెళ్లిపోయింది. దీంతో అంతా హమ్మయ్య... అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి ప్రదేశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ కొందరు, ‘‘వధూవరులు చాలా ధైర్యవంతులు’’.. అంటూ మరికొందరు, ‘‘లొకేషన్ చాలా బాగుంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.80లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పిజ్జా బదులు ఈ పరాటా ఎంతో మేలన్న ఆనంద్ మహీంద్రా.. ఇందుకు అభిషేక్ బచ్చన్ ఏమన్నారంటే..

Updated Date - Dec 22 , 2023 | 03:01 PM