Share News

Coconut Oil: కొబ్బరినూనెతో.. మీ ఒంటికీ, వంటింటికీ కలిగే 6 లాభాలేంటో తెలుసా..

ABN , Publish Date - Dec 21 , 2023 | 04:41 PM

కొబ్బరి నూనె లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఇంట్లో ఏ వస్తువు లేకున్నా.. కొబ్బరి నూనె మాత్రం విధిగా ఉంటుంది. ఈ కొబ్బరి నూనెను చాలా మంది తలకు మాత్రమే వాడుతుంటారు. కొందరు మాత్రం శరీరానికీ మర్దనా చేస్తుంటారు. అయితే..

Coconut Oil: కొబ్బరినూనెతో.. మీ ఒంటికీ, వంటింటికీ కలిగే 6 లాభాలేంటో తెలుసా..

కొబ్బరి నూనె లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఇంట్లో ఏ వస్తువు లేకున్నా.. కొబ్బరి నూనె మాత్రం విధిగా ఉంటుంది. ఈ కొబ్బరి నూనెను చాలా మంది తలకు మాత్రమే వాడుతుంటారు. కొందరు మాత్రం శరీరానికీ మర్దనా చేస్తుంటారు. అయితే ఈ కొబ్బరి నూనె మీ శరీరానికి మాత్రమే కాకుండా మీ వంటింటికీ అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనె వల్ల కలిగే 6 ప్రధాన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

దిగువ మధ్య తరగతి ప్రజల నుంచి ధనవంతుల వరకూ అంతా విరివిగా వాడే నూనెల్లో కొబ్బరి నూనె ఒకటి. కొబ్బరి నూనెతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. అయితే ఈ కొబ్బిరి నూనెు వల్ల శరీరానికి మాత్రమే కాకుండా వంటింట్లోనూ ఎంతో ఉపయోగపడుతుంది. వంట పాత్రలు శుభ్రం చేసేందుకు చాలా బాగా పని చేస్తుంది. ఇంతకీ ఆ ప్రయోజనాలు ఏంటంటే..


Cooking-Utensils.jpg

వంటింట్లో కొబ్బరి నూనెతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా చెక్క సామాన్లను శుభ్రం చేయడంలో ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. సాధారణంగా కాలం గడిచే కొద్దీ చెక్క చెంచాలు, గిన్నెలు వంటివి అపరిశుభ్రంగా, నిస్తేజంగా మారుతుంటాయి. ఇలాంటి సమయంలో కొబ్బరి నూనెతో వాటిని తిరిగి కొత్తగా మార్చేయవచ్చు. పదే పదే నీళ్లతో కడగడం వల్ల అవి మరింతగా దెబ్బతింటాయి. ఇందుకు బదులుగా వాటిపై కొబ్బరి నూనె అప్లై చేసి కొద్ది సేపు ఉంచాలి. దీనికి ముందు వాటిని శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. కొబ్బెర నూనె పూసిన తర్వాత కిచెన్ క్లాత్‌తో శుభ్రం చేయడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.

coconut-oil-cleaning.jpg

రోజూ వంట చేస్తుండడం వల్ల వంట పాత్రల అడుగు భాగం వ్యర్థాలతో రంగు మారిపోతుంది. ఇలాంటి సమయంలో కొబ్బరి నూనెతో వాటిని తిరిగి తళతళా మెరిసేలా చేయొచ్చు. పాత్రల అడుగు భాగంపై కొబ్బరి నూనెను అప్లై చేయాలి. కొన్ని నిముషాల తర్వాత కిచెన్ స్పాంజ్‌తో దాన్ని శుభ్రం చేయాలి. ఇలా చేస్తే వంట పాత్రలు వాటి సహజ రంగును సంతరించుకుంటాయి.

Mouth-wash.jpg

కొబ్బరి నూనెతో వంటింటికే కాకుండా మీ నోటికీ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ప్రధానంగా పళ్లు, చిగుళ్లకు బాగా పని చేస్తుంది. కొబ్బరి నూనెను నోట్లో వేసుకుని కొన్ని నిముషాల పాటు పుక్కిలించి, తర్వాత ఉమ్మేయాలి. ఇలా చేయడం వల్ల నోట్లోని బాక్టీరియా తొలగిపోయి దంతాలతో పాటూ చిగుళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అదేవిధంగా నోటి దుర్వాసనను పోతుంది. ఉదయం లేవగానే ఇలా చేయడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.


Makeup-remover.jpg

కొబ్బరి నూనె మేకప్ రిమూవర్‌గా కూడా పని చేస్తుంది. మేకప్ ఉత్పత్తుల కారణంగా చర్మం దెబ్బతినే అవకాశం ఉంటుంది. మేకప్ తొలగించే ముందు కొబ్బరి నూనెను మొఖానికి రాయడం వల్ల చర్మం దెబ్బతినకుండా ఉంటుంది. అలాగే చర్మం తేమగా ఉండేలా సాయపడుతుంది. అయితే ఇలా చేయడానికి ముందు కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేయాల్సి ఉంటుంది. తర్వాత దాన్ని మొఖానికి బాగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా ఉండడంతో పాటూ అందంగా కూడా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

Weight-loss.jpg

మీ రోజూవారి వంటకాల్లో కొబ్బరి నూనెను జోడించడం వల్ల కడుపులో కొవ్వు కరిగి శరీర బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కొబ్బరినూనెలోని కొవ్వు ఆమ్లాలు మీరు బరువు తగ్గే ప్రక్రియను సులభతరం చేస్తాయి. అలాగే ఇది మీ జీవక్రియ రేటును వేగవంతం చేయడమే కాకుండా అదరపు కేలరీలను బర్న్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.

Immunity.jpg

కొబ్బరి నూనె వాడడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇందులోని యాంటీవైరల్, యాంటీ మైక్రోబియల్ కణాలు ఫ్రీ రాడికల్స్, ఇతర హానికరమైన ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటానికి సాయపడతాయి. అలాగే కొబ్బరినూనెలలోని లారిక్ ఆమ్లం మీ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటూ ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి బాగా పనిచేస్తుంది.

శరీరంలో విటమిన్ B12 తక్కువైతే.. ఎంత ప్రమాదమో తెలుసా..

Updated Date - Dec 21 , 2023 | 04:43 PM