Viral Video: అల్లావుద్దీన్ చాపకు టెక్నాలజీ జోడించిన యువకుడు.. రోడ్డుపై ఎలా దూసుకెళ్తున్నాడో చూడండి..
ABN , First Publish Date - 2023-11-07T19:28:35+05:30 IST
అల్లావుద్దీన్ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. అరేబియన్ నైట్స్ అల్లావుద్దీన్ అద్భుత దీపం కథలు.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరినీ అలరిస్తుంటాయి. ముఖ్యంగా అల్లావుద్దీన్ ప్రయాణించే చాప ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. తాను ఎక్కడికి వెళ్లాలన్నా చాప కూర్చుంటే చాలు..
అల్లావుద్దీన్ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. అరేబియన్ నైట్స్ అల్లావుద్దీన్ అద్భుత దీపం కథలు.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరినీ అలరిస్తుంటాయి. ముఖ్యంగా అల్లావుద్దీన్ ప్రయాణించే చాప ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. తాను ఎక్కడికి వెళ్లాలన్నా చాప కూర్చుంటే చాలు.. అదే తీసుకెళ్తుంది. ఇలా నిజ జీవితంలో జరిగితే ఎంత బాగుంటుందీ.. అని అంతా అనుకుంటుంటారు. దీన్నే ఓ యువకుడు నిజం చేసి చూపించాడు. ప్రస్తుత టెక్నాలజీ సాయంతో అల్లావుద్దీన్ చాపను రూపొందించాడు. చాపపై కూర్చుని రోడ్లపై రయ్యిన దూసుకెళ్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. గురుగ్రామ్‌కు చెందిన కెవిన్ కౌల్ అనే యువకుడు.. అల్లావుద్దీన్ (Aladdin) వేషధారణలో మ్యాజిక్ మ్యాట్‌పై రోడ్లపై దూసుకెళ్తున్నాడు. చూసేందుకు అచ్చం అల్లావుద్దీన్.. చాపపై దూసుకెళ్తున్నట్లే ఉండడంతో అంతా ఇతన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. మ్యాజిక్ మ్యాట్ (Magic mat) కోసం ముందుగా అతను స్కేట్‌బోర్డ్‌కు చక్రాలు అమర్చి, దానిసై చాప ఆకారంలో తీర్చిదిద్దాడు. రిమోట్ కంట్రోల్ ద్వారా చాపను నియంత్రిస్తూ ఎంచక్కా రోడ్డుపైకి వచ్చేశాడు. వస్తూ వస్తూ మిగతా వాహనదారులకు అభివాదం చేస్తూ వెళ్లాడు. మధ్యలో ఓ రెస్టారెంట్ వద్ద ఆగి ఐస్ క్రీమ్ తీసుకుంటాడు.
తర్వాత అక్కడి నుంచి వెళ్తూ మధ్యలో ఎదురైన వారిని పలుకరిస్తూ వెళ్లిపోయాడు. చుట్టూ ఉన్న వారంతా ఇతన్ని ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు. ఇక చిన్నపిల్లలైతే సంతోషంతో కేరింతలు కొడుతూ అల్లావుద్దీన్ వేషధారికి హాయ్.. హాయ్ అంటూ చేతులు కలిపారు. మధ్యలో చాపపై కూర్చుని కూడా ప్రయాణించాడు. తాను చేత్తో ఆదేశిస్తే చాప అటూ ఇటూ కదులుతుంది అని చూపిస్తాడు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘వావ్!! ఈ కుర్రాడి ఐడియా అదిరిపోయింది’’.. అంటూ కొందరు, ‘‘బ్రదర్.. పోలీసులు లైసెన్స్ అడగలేదా’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి విన్యాసాలు రోడ్లపై చేయడం ప్రమాదకరం’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.