Share News

Viral Video: ఇంటి యజమానితో గొడవపడుతున్న మహిళ.. సడన్‌గా ఎటాక్ చేసిన పెంపుడు కుక్క.. చూస్తుండగానే..

ABN , First Publish Date - 2023-11-05T15:51:11+05:30 IST

పెంపుడు కుక్కలు తమ యజమానుల పట్ల ఎంత విధేయతగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కొన్నిసార్లు అవి పక్కింటి వాళ్లు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడడం చూస్తుంటాం. కొన్నిసార్లు ఇవి పెద్ద గొడవలకు దారి తీయొచ్చు. ఇలాంటి...

Viral Video: ఇంటి యజమానితో గొడవపడుతున్న మహిళ.. సడన్‌గా ఎటాక్ చేసిన పెంపుడు కుక్క.. చూస్తుండగానే..

పెంపుడు కుక్కలు తమ యజమానుల పట్ల ఎంత విధేయతగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కొన్నిసార్లు అవి పక్కింటి వాళ్లు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడడం చూస్తుంటాం. కొన్నిసార్లు ఇవి పెద్ద గొడవలకు దారి తీయొచ్చు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంటి యజమానితో గొడవపడుతున్న మహిళ పైకి పెంపుడు కుక్క దాడి చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఢిల్లీలోని (Delhi) స్వరూప్ నగర్ పోలీస్ స్టేషన్ నగర్ పరిధిలోని వీధి నంబర్ 14లో నవంబర్ 3న ఈ ఘటన చోటు చేసుకుంది. పెంపుడు కుక్క (pet dog) ఒకటి పక్కింటి వద్ద మలవిసర్జన చేసింది. గమనించిన సదరు రియా అనే మహిళ.. కుక్క యజమాని ఇంటి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. ‘‘మీ కుక్కను ఇంట్లోనే పెట్టుకోకుండా.. ఇలా వదిలితే ఎలా’’.. అంటూ ఇంటి యజమానితో గొడవ పడింది. అదే సమయంలో కుక్క ఆమెను టార్గెట్ చేసింది. తన యజమానితో గొడవపడడాన్ని చూసి ఒక్కసారిగా ఆవేశంతో ఆమెపైకి (Dog attack on woman) దాడికి దిగుతుంది. దీంతో మహిళకు కోపం వచ్చి కుక్కను కొట్టడానికి ప్రయత్నిస్తుంది.

Viral Video: ఈ గ్రామస్తులంతా రోడ్డు పని చేస్తున్నారనుకుంటే పొరపాటే.. తీక్షణంగా గమనిస్తే మాత్రం షాకవ్వాల్సిందే..

దీంతో కుక్క ఇంకా రెచ్చిపోయి ఆమె పైకి దూకుతుంది. దాని యజమాని అదుపు చేయాల్సింది పోయి.. మహిళ పైనే దాడికి దిగుతాడు. గట్టిగా తోయడంతో ఆమె రోడ్డుపై పడిపోతుంది. కుక్క మళ్లీ ఆమెను కరిచేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో పక్కన ఉన్న వాళ్లు ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తారు. ఎంత ప్రయత్నించినా కుక్క మాత్రం ఆమెను వదలదు. పదే పదే మహిళపై దాడి చేసి గాయపరుస్తుంది. చివరకు వారు ఎలాగోలా కుక్కను పట్టుకుని పక్కకు తీసుకెళ్తారు. మరో యువతి కూడా గాయపడ్డ మహిళను బూతులు తిట్టడంతో పాటూ రాళ్లతో కొడుతుంది. కుక్క దాడిలో మహిళ చేతికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, కుక్క దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: అర్ధరాత్రి ఇంట్లోకి సడన్‌గా భర్త రావడంతో.. ప్రియుడిని కూలర్‌లో దాచిన భార్య.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..

Updated Date - 2023-11-05T15:51:14+05:30 IST