Share News

Wife-Husband: వంట చేయడం లేదని కూడా విడాకులు.. విడిపోయేందుకు ఈ తరం భార్యాభర్తలు చెబుతున్న వింత కారణాలు ఇవేనట..!

ABN , First Publish Date - 2023-10-17T11:19:06+05:30 IST

భారతీయ వివాహ వ్యవస్థలో కొత్త పోకడలు వచ్చి చేరి చాలా కాలమైంది. ఇక ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు వివాహ బంధానికి విలువ లేకుండా పోయిందని చెప్పకనే చెబుతున్నాయి.

Wife-Husband: వంట చేయడం లేదని కూడా విడాకులు.. విడిపోయేందుకు ఈ తరం భార్యాభర్తలు చెబుతున్న వింత కారణాలు ఇవేనట..!

Wife-Husband: భారతీయ వివాహ వ్యవస్థలో కొత్త పోకడలు వచ్చి చేరి చాలా కాలమైంది. ఇక ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు వివాహ బంధానికి విలువ లేకుండా పోయిందని చెప్పకనే చెబుతున్నాయి. అందుకే ఈ రోజుల్లో పెళ్లిళ్లు మూణాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. పెళ్లైన కొన్నాళ్లలకే వివాహ బంధం బీటలు వారుతోంది. వివాహేతర సంబంధాలు, అపార్థాలు, ఆర్థిక పరమైన కారణాలు, ఈగోలు విడాకులకు దారి తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని బంధాలైతే చాలా విచిత్రంగా, ఇంకా చెప్పాలంటే వింత కారణాలతో విడిపోతున్నాయి. అలా విడాకులకు కారణమవుతున్న కొన్ని వింత విషయాలను ముంబైకి చెందిన న్యాయవాది తాన్య అప్పాచు కౌల్ (Tanya Appachu Kaul) తెలియజేశారు. ఆమె చెప్పిన ఆ వింత కారణాలను వింటే నోరెళ్లబెట్టాల్సిందే.

ఇక విడాకుల (Divorce) కోసం దంపతులు చెబుతున్న ఈ వింత కారణాల జాబితాలో భర్త అతిగా ప్రేమించడం దగ్గర నుండి పడక గదిలో తన పట్ల ప్రవర్తించే తీరు వరకు చాలా భిన్నంగా ఉన్నాయి. లాయర్ తాన్య అప్పాచు కౌల్ ఈ విషయాలను తన ఇన్‌స్టాగ్రాం ఖాతా ద్వారా ఓ వీడియో రూపంలో నెటిజన్లతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పలు విడాకుల్లోని వింత కారణాలను పేర్కొనడం జరిగింది. న్యాయవాది వీడియోలో చెప్పిన దాని ప్రకారం.. "భర్త తనను చాలా ప్రేమగా చూసుకోవడం. తన పట్ల అతిగా శ్రద్ధ వహించడం. ఎప్పుడూ తనతో గొడవ పడకపోవడం" చేస్తున్న ఇలాంటి భర్త తనకు వద్దని చెప్పిందట ఓ భార్య. "హనీమూన్ సమయంలో భార్య అసభ్యంగా దుస్తులు ధరించిందని" తనకు విడాకులు కావాలని చెప్పాడట ఒక భర్త. అలాగే "యుపీఎస్సీ పరీక్ష కోసం సిద్ధమవ్వుతూ.. తన భర్త పట్టించుకోవడం లేదని" వెంటనే విడాకులు ఇప్పించాలని పేర్కొందట మరో భార్య.

ఇప్పుడు చెప్పుకోబోయే ఈ కారణాలతే మరీ విడ్డూరం. అవేంటంటే.. భర్త పాదాలను తాకేందుకు భార్య నిరాకరించడంతో విడాకులు అడిగాడట ఓ భర్త. అలాగే "భార్యకు వంట చేయడం రాదని, టిఫిన్ తినకుండా ఆఫీస్‌కు వెళ్లాల్సి వస్తుందని" మరో భర్త విడాకులు కోరాడట. ఇలా పలు జంటలు విడాకుల కోసం చెప్పిన విచిత్ర, వింత కారణాల ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు వీడియోకు 16లక్షల వరకు వ్యూస్, 1లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్స్ చేస్తున్నారు. 'సాకులు వెతికే వారికి, చిన్న చిన్న సమస్యలు కూడా ట్రిగ్గర్ కావచ్చు' అని ఓ నెటిజన్ అంటే.. 'తాను పెళ్లి చేసుకోకూడదని చెప్పేందుకు సరైన కారణాలు' అంటూ కామెంట్ చేశాడు మరో నెటిజన్.

Viral News: రాత్రి 2.30 గంటల సమయం.. షాపింగ్‌ మాల్‌లో ఒంటరిగా కనిపించిన యువతి.. సెక్యూరిటీ సిబ్బంది వెళ్లి అడగ్గానే షాకింగ్ ట్విస్ట్..!


Updated Date - 2023-10-17T11:19:46+05:30 IST