Share News

Viral Video: ఇంట్లోకి చొరబడి.. పండు అనుకుని ఉల్లిపాయను ఎత్తుకొచ్చిన కోతి.. కొరికిన తర్వాత దాని రియాక్షన్ చూడండి..

ABN , Publish Date - Dec 27 , 2023 | 02:48 PM

కోతి చేష్టలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ వస్తువు కంటికి కనపడినా తీసుకుని తినేయడం, లేదా విసిరేయడం చేస్తుంటాయి. ఇళ్లల్లోకి చొరబడిన సందర్భాల్లో కొన్నిసార్లు విలువైన వస్తువులను కూడా ఎత్తుకెళ్లడం చూస్తూ ఉంటాం. ఇలాంటి...

Viral Video: ఇంట్లోకి చొరబడి.. పండు అనుకుని ఉల్లిపాయను ఎత్తుకొచ్చిన కోతి.. కొరికిన తర్వాత దాని రియాక్షన్ చూడండి..

కోతి చేష్టలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ వస్తువు కంటికి కనపడినా తీసుకుని తినేయడం, లేదా విసిరేయడం చేస్తుంటాయి. ఇళ్లల్లోకి చొరబడిన సందర్భాల్లో కొన్నిసార్లు విలువైన వస్తువులను కూడా ఎత్తుకెళ్లడం చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, కోతికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. పండు అనుకుని ఓ కోతి ఉల్లిపాయను కొరికేసింది. చివరకు అది ఇచ్చిన రియాక్షన్ చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కోతి ఇంట్లోకి చొరబడి ఉల్లిపాయను ఎత్తుకెల్లింది. ఎంచక్కా ఓ గోడపై కూర్చుని దాన్ని తినేయాలని ప్రయత్నించింది. అయితే ఇలా కొరికిందో లేదో.. (monkey bit the onion) ఒక్కసారిగా మంట పుట్టడంతో ఒక్కసారిగా కోతి కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘‘వామ్మో! పండు అనుకుని కొరికితే.. ఇలా అయ్యిందేంటీ.. దీన్ని తినడం పెద్ద సమస్యే’’.. అనుకుంటూ, మరోవైపు కన్నీళ్లు తుడుచుకుంటూ తెగ ఇబ్బందిపడిపోయింది.

పాలతో పాటూ గుడ్డు కూడా తింటున్నారా.. ఇది ఎంత డేంజరంటే..

ఈ కోతిని గమనిస్తు్న్న వారు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ‘‘కోతిని కూడా ఏడిపించిన ఉల్లిపాయ’’.. అంటూ కొందరు, ‘‘ఇక జన్మలో ఉల్లిపాయను టచ్ చేయదు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 51వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: గోడ మీద పులి.. చుట్టూ విచిత్రంగా చూస్తున్న జనం.. చివరకు ఏమైందంటే..

Updated Date - Dec 27 , 2023 | 02:48 PM