Share News

Viral Video: పెళ్లి పీటలపై వధువు నిర్వాకానికి అవాక్కైన వరుడు.. చివరకు ఎవరికీ తెలీకుండా ఎలా మ్యానేజ్ చేశాడో చూడండి..

ABN , Publish Date - Dec 24 , 2023 | 02:54 PM

పెళ్లి అంటేనే ఓ వైపు బంధువుల పలకరింపులు.. మరోవైపు స్నేహితుల హడావుడి.. ఇంకోవైపు క్షణం కూడా విశ్రాంతి లేనంత కంగారు ఉంటుంది. దీంతో చాలా మంది వధూవరులు ఇలాంటి సమయాల్లో తీవ్ర అలసటకు గురవుతుంటారు. అయినా...

Viral Video: పెళ్లి పీటలపై వధువు నిర్వాకానికి అవాక్కైన వరుడు.. చివరకు ఎవరికీ తెలీకుండా ఎలా మ్యానేజ్ చేశాడో చూడండి..

పెళ్లి అంటేనే ఓ వైపు బంధువుల పలకరింపులు.. మరోవైపు స్నేహితుల హడావుడి.. ఇంకోవైపు క్షణం కూడా విశ్రాంతి లేనంత కంగారు ఉంటుంది. దీంతో చాలా మంది వధూవరులు ఇలాంటి సమయాల్లో తీవ్ర అలసటకు గురవుతుంటారు. అయినా ఎలాగోలా ఓపిక తెచ్చుకుని వివాహ తంతును పూర్తి చేస్తుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు సరదా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పెళ్లి పీటలపై వధువు నిర్వాకానికి వరుడు ఒక్కసారిగా అవాక్కయ్యాడు. అయితే ఎవరికీ తెలీకుండా చివరకు బాగానే మ్యానేజ్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వరుడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రాజస్థాన్‌లో (Rajasthan) జరిగిన వివాహ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వధూవరులు (bride and groom) పెళ్లి పీటలపై కూర్చిన ఉండగా.. మధ్యలో అనూహ్య ఘటన చోటు చేసుకుంటుంది. అప్పటికే అలసిపోయి ఉన్న వధువు.. ఇక నా వల్ల కాదు బాబోయ్.. అన్నట్లుగా ఆమెకు తెలీకుండా (bride fell asleep on wedding stage) కూర్చునే కునుకు తీస్తుంది. అయితే మొఖానికి ముసుగు ఉండడంతో ఎవరికీ అనుమానం రాదు. కాసేపటికి వరుడికి డౌట్ వచ్చి.. వధువు వైపు చూస్తాడు. ఆమె కూల్‌గా నిద్రపోతుండడం చూసి అవాక్కవుతాడు.

Viral Video: పెళ్లి పీటలపై మామ మనుసు గెలుచుకున్న అల్లుడు.. ఇంతకీ ఇతడు చేసిన పనేంటంటే..

బంధువులు చూస్తే నవ్వుకుంటారనే ఉద్దేశంతో.. మెల్లగా తన చేత్తో ఆమెను తట్టి లేపుతాడు. వరుడు అలెర్ట్ చేయడంతో వధువు ఒక్కసారిగా ఉలిక్కిపడి మెలకువలోకి వస్తుంది. అయితే ఈ తంతును మొదటి నుంచీ పసిగట్టిన కొందరు వీడియో తీసేసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘భార్య పట్ల ఇతడి ప్రేమ చూస్తుంటే ముచ్చటేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి భర్త ఉంటే.. కుటుంబంలో ఎలాంటి సమస్యలూ రావు’’.. అంటూ మరికొందరు, ‘‘మీరు నిజంగా గ్రేట్ బ్రదర్’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 31వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Wife: రాత్రి ఇంటికి వచ్చిన భర్తకు లోపల నుంచి వినిపించిన శబ్ధాలు.. భార్యపై జరుగుతున్న దారుణాన్ని చాటుగా చూసి కూడా..

Updated Date - Dec 24 , 2023 | 02:54 PM