Share News

Viral Video: దోచుకోవాలని వచ్చి.. క్షణాల్లో పారిపోయాడు.. కౌంటర్‌లో యువతి వద్ద అతడు చేసిన మిస్టేక్ ఏంటంటే..

ABN , Publish Date - Dec 22 , 2023 | 07:58 PM

కొందరు నేరస్థులు చాలా తెలివిగా నేరాలకు పాల్పడడం చూస్తూ ఉంటాం. సైబర్ నేరాలకు పాల్పడేవారు కొందరైతే.. మరికొందరు షాపుల్లోకి చొరబడి మరీ నగదు, నగదు ఎత్తుకుపోతుంటారు. ఈ క్రమంలో వారి తెలివితేటలు చూస్తే పోలీసులు కూడా అవాక్కయ్యేలా ఉంటాయి. అయితే...

Viral Video: దోచుకోవాలని వచ్చి.. క్షణాల్లో పారిపోయాడు.. కౌంటర్‌లో యువతి వద్ద అతడు చేసిన మిస్టేక్ ఏంటంటే..

కొందరు నేరస్థులు చాలా తెలివిగా నేరాలకు పాల్పడడం చూస్తూ ఉంటాం. సైబర్ నేరాలకు పాల్పడేవారు కొందరైతే.. మరికొందరు షాపుల్లోకి చొరబడి మరీ నగదు, నగదు ఎత్తుకుపోతుంటారు. ఈ క్రమంలో వారి తెలివితేటలు చూస్తే పోలీసులు కూడా అవాక్కయ్యేలా ఉంటాయి. అయితే అన్ని రోజులు మనవి కావన్నట్లుగా.. కొన్నిసార్లు ఇలాంటి నేరస్థులకూ కాలం ఎదురుతిరుగుతుంటుంది. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి దోచుకోవాలని షాపులోకి వెళ్లాడు. అయితే క్షణాల్లోనే బయటికి పరుగులు తీశాడు. కౌంటర్‌లోని యువతి వద్ద అతడు చేసిన మిస్టేక్ తెలుసుకుని నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ సంఘటన 2018లో యూఎస్‌లోని కొలరాడోలోని (Colorado) అరోరాలో జరిగింది. అయితే ఈ వీడియో మాత్రం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి షాపులో (Attempted theft) చోరీ చేసేందుకు వెళ్తాడు. షాపులోని కౌంటర్‌లో యువతి (young woman) ఒక్కటే ఉంటుంది. లోపలికి వెళ్లిన దొంగ.. కౌంటర్ వద్దకు వెళ్లగానే ఫ్యాంట్‌లో నుంచి తుపాకీ (gun) బయటికి తీస్తాడు. దాన్ని యువతికి చూపించి బెదిరించాలనేది అతడి ఉద్దేశం. అయితే తుపాకీ తీసి బెదిరించాలనే క్రమంలో చేతి నుంచి జారి యువతి వైపు పడిపోతుంది.

Viral Video: డాక్టర్ అవతారం ఎత్తిన గొరిల్లా.. గాయపడిన పక్షిని ఎలా పరిశీలిస్తోందో చూస్తే అవాక్కవుతారు..

తుపాకీ పడిపోవడంతో అతను ఒక్కసారిగా కంగారుపడిపోయి.. దాన్ని తీసుకునేందుకు కౌంటర్ ఇవతలి వైపునకు దూకాలని చూస్తాడు. అయితే అప్పటికే కిందపడ్డ తుపాకీని యువతి.. భయం భయంగానే తన చేతిలోకి తీసుకుంటుంది. దీంతో దొంగ ‘‘వామ్మో! చచ్చాన్రో’’.. అని అనుకుంటూ బయటికి పరుగులు తీస్తాడు. తుపాకీ తీసుకున్న యువతి.. ఆ షాక్‪‌లోనే ఉండిపోతుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ దొంగ లేచిన వేలావిశేషం ఏమీ బాగాలేన్నట్టుంది’’.. అంటూ కొందరు, ‘‘బాగానే శాస్తి జరిగింది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ప్రీ వెడ్డింగ్ షూట్‌లో వరుడికి వధువు ముద్దు పెడుతుండగా షాకిచ్చిన పాము.. ఉన్నట్టుండి మధ్యలోకి దూసుకురావడంతో..

Updated Date - Dec 22 , 2023 | 07:59 PM