Share News

Viral Video: కార్ల రేసులో అందరినీ భయపట్టే ఇతడిని చూసి.. పులి ఎలా భయపడిందో చూస్తే అవాక్కవుతారు...

ABN , Publish Date - Dec 24 , 2023 | 05:22 PM

ఫార్ములా వన్ అనగానే ప్రస్తుత తరానికి గుర్తొచ్చే పేరు లూయిస్ హామిల్టన్. ఎఫ్1 చరిత్రలో ఇతడి పేరు చిరస్థాయిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇతడికి సాధారణంగా పులులతో ఆడుకోవడం సరదా. గతంలో..

Viral Video: కార్ల రేసులో అందరినీ భయపట్టే ఇతడిని చూసి.. పులి ఎలా భయపడిందో చూస్తే అవాక్కవుతారు...

ఫార్ములా వన్ అనగానే ప్రస్తుత తరానికి గుర్తొచ్చే పేరు లూయిస్ హామిల్టన్. ఎఫ్1 చరిత్రలో ఇతడి పేరు చిరస్థాయిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇతడికి సాధారణంగా పులులతో ఆడుకోవడం సరదా. గతంలో ఎన్నోసార్లు ఇతను పులితో సరదాగా గడిపిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా, హామిల్టన్‌ను చూసి భయపడిన పులి పాత వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘హామిల్టన్ చూడగానే పులికీ వణుకు పుట్టింది’’ .. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. లూయిస్ హామిల్టన్ (Lewis Hamilton) సరదా గడిపేందుకు అప్పుడప్పుడూ పులులు వద్దకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో అతను ఓసారి పులి ఎన్‍‌క్లోజర్‌లోకి (Tiger enclosure) వెళ్లాడు. తన మానాన తాను వెళ్తున్న పులిని కొద్దిసేపు దూరం నుంచి గమనించిన హామిల్టన్.. తర్వాత మెల్లగా దాని వెనుకకు వెళ్లాడు. ఒక్కసారిగా దాని మీద చేతులు వేయడంతో.. పులి సడన్‌గా భయపడిపోయింది.

Viral Video: పెళ్లి పీటలపై మామ మనుసు గెలుచుకున్న అల్లుడు.. ఇంతకీ ఇతడు చేసిన పనేంటంటే..

వెంటనే వెల్లకిలా నేలపై పడిపోయిన పులి.. ‘‘హే.. హామిల్టన్.. మొత్తానికి నన్నే భయపెట్టావ్’’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. ఇదంతా మాకు మామూలే.. అన్నట్లుగా అతడితో ప్రేమగా కలిసిపోతుంది. ఈ పులికి శిక్షణ ఇవ్వడంతో మొదటి నుంచీ హామిల్టన్‪‌కు బాగా అలవాటు అయిందట. ఇదిలావుండగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘హామిల్టన్ అంటే పలికీ హడలే’’.. అంటూ కొందరు, ‘‘ఈ పులి కామెడీ భలే చేస్తోందే’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: పెళ్లి పీటలపై వధువు నిర్వాకానికి అవాక్కైన వరుడు.. చివరకు ఎవరికీ తెలీకుండా ఎలా మ్యానేజ్ చేశాడో చూడండి..

Updated Date - Dec 24 , 2023 | 05:22 PM