Viral: రోడ్డు పక్కన చిన్న కాఫీ స్టాల్.. తాగేందుకు వెళ్లి.. అక్కడ ఉన్న బోర్డుపై ఏం రాసి ఉందో చదివి అవాక్కైన కస్టమర్లు..!

ABN , First Publish Date - 2023-08-16T16:14:05+05:30 IST

లక్ష్య సాధనలో కొందరు కలల వరకే పరిమితమైతే.. మరికొందరు తాము నిర్ధేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంటారు. ఈ క్రమంలో ఎన్ని కష్టాలు వచ్చినా వెనకడుగు మాత్రం వేయరు. అంతిమంగా తాము అనుకున్నది సాధించి, అందరితో శభాష్ అని అనిపించుకుంటుంటారు. ఇలాంటి..

Viral: రోడ్డు పక్కన చిన్న కాఫీ స్టాల్.. తాగేందుకు వెళ్లి.. అక్కడ ఉన్న బోర్డుపై ఏం రాసి ఉందో చదివి అవాక్కైన కస్టమర్లు..!

లక్ష్య సాధనలో కొందరు కలల వరకే పరిమితమైతే.. మరికొందరు తాము నిర్ధేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంటారు. ఈ క్రమంలో ఎన్ని కష్టాలు వచ్చినా వెనకడుగు మాత్రం వేయరు. అంతిమంగా తాము అనుకున్నది సాధించి, అందరితో శభాష్ అని అనిపించుకుంటుంటారు. ఇలాంటి వ్యక్తుల విజయగాధలకు సంబంధించిన వార్తలు నెట్టింట నిత్యం తెగ చక్కర్లు కొడుతుంటాయి. ప్రస్తుతం ఓ యువకుడి టీ స్టాల్‌కు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన చిన్న కాఫీ స్టాల్ పెట్టిన యువకుడు.. ఎదురుగా బోర్డుపై రాసింది చూసి కస్టమర్లు అవాక్కవుతున్నారు.

ముంబైలోని (Mumbai) ఓ యువకుడి టీ స్టాల్‌కి (tea stall) సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మయాంక్ పాండే అనే యువకుడు ముంబై నగరంలోని రద్దీ రోడ్డు పక్కన ది కాఫీ బార్ (Coffee bar) పేరుతో చిన్న స్టాండ్‌పై టీ స్టాల్ పెట్టుకున్నాడు. అయితే ఇతడికి ఎప్పటికైనా తన టీ స్టాల్‌ని అతి పెద్ద మార్కెట్‌గా తీర్చిదిద్దాలనేది ఆశయం. పదే పదే తన ఆశయం తనకు గుర్తుకు ఉండేలా వెరైటీ ప్లాన్ వేశాడు. తన దుకాణం ఎదుట ఓ బోర్డుపై ‘‘నేను నా కాఫీ బార్‌ను గ్లోబల్ మార్కెట్‌కు తీసుకెళ్లాలనుకుంటున్నాను’’.. అని రాసి రాశాడు.

Viral Video: ఆనంద్ మహీంద్రాను కట్టిపడేసిన ట్రాక్టర్ల వీడియో.. యువకులంతా గుంపులుగా థియేటర్లకు రావడం చూసి..

viral-trending-news.jpg

కాఫీ తాగడానికి వచ్చే వారంతా ఈ బోర్డు చూసి షాక్ అవుతున్నారు. పని పట్ల యువకుడి అంకితభావం, చిత్తశుద్ధిని చూసి అంతా శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. కొందరు అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి.. ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఇటీవల కొందరు ఈ దుకాణాన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త (Viral news) నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మీ కోరిక నెరవేరాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం’’.. అని కొందరు, ‘‘ఇలాంటి వారు ఎప్పటికైనా పైకి వస్తారు’’.. అని మరికొందరు, ‘‘కృషితో నాస్తి దుర్భిక్షం’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ పోస్టు మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: బాబోయ్.. రెస్టారెంట్‌కు వెళ్లాక కూడా కాస్త చూసుకుని తినండయ్యా.. చికెన్ కర్రీ ఆర్డర్ ఇస్తే అందులో ఏమొచ్చిందో చూస్తే..!

Updated Date - 2023-08-16T16:14:05+05:30 IST