Viral Video: వామ్మో! ఇదెక్కడి విడ్డూరం.. నేలపై సిమెంట్‌ను బద్దలుకొట్టగా.. అడుగున షాకింగ్ దృశ్యం.. నీళ్లలో ఉండాల్సినవి కాస్తా..

ABN , First Publish Date - 2023-08-09T21:44:05+05:30 IST

నేలపై ఉండాల్సినవి ఆకాశంలో, ఆకాశంలో తిరిగేవి నేలపై కనిపిస్తే ఎలా ఉంటుంది. అలాగే భూమిపై సంచరించేవి నీటిలో, నీటిలో ఉండాల్సినవి నేలపై తిరుగుతుంటే.. ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ తెగ వైరల్ అవుతుంటాయి. అయితే...

Viral Video: వామ్మో! ఇదెక్కడి విడ్డూరం.. నేలపై సిమెంట్‌ను బద్దలుకొట్టగా.. అడుగున షాకింగ్ దృశ్యం.. నీళ్లలో ఉండాల్సినవి కాస్తా..

నేలపై ఉండాల్సినవి ఆకాశంలో, ఆకాశంలో తిరిగేవి నేలపై కనిపిస్తే ఎలా ఉంటుంది. అలాగే భూమిపై సంచరించేవి నీటిలో, నీటిలో ఉండాల్సినవి నేలపై తిరుగుతుంటే.. ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ తెగ వైరల్ అవుతుంటాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. నేల అడుగు నుంచి శబ్ధాలు వస్తుండడంతో బద్దలుకొట్టి చూశారు. అయితే లోపలి దృశ్యం చూసి అంతా పరుగులు పెట్టారు..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఓ ప్రాంతంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. సిమెంట్ నేల అడుగు నుంచి శబ్ధాలు వస్తుండడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే రెస్క్యూ సిబ్బందికి ఫోన్ చేశారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది నేలపై ఉన్న సిమెంట్‌ను తొలగించారు. అయితే ఆశ్చర్యకరంగా అడుగు నుంచి ఓ పెద్ద మొసలి (crocodile came out from the ground) బయటికి వచ్చింది. దీన్ని చూడగానే అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. నేల అడుగు నుంచి మొసలి రావడం ఏంటీ.. అంటూ భయాందోళనకు గురయ్యారు.

Businessman: బ్యాంకు నుంచి ఫోన్‌.. వాళ్లు చెప్పింది విని విస్తుపోయిన వ్యాపారవేత్త.. తన రోగాలకూ భార్యే కారణమని తెలిసి..!

Crocodile-viral.jpg

అంతలో ఊహించని విధంగా దాని కింద నుంచి మరో మొసలి బయటికి వచ్చింది. వచ్చీ రాగానే అక్కడున్న వారిపై దాడి చేయాలని చూసింది. దీంతో వారంతా భయంతో పరుగులు పెట్టారు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో! ఇదెక్కడి విడ్డూరం’’.. అంటూ కొందరు, ‘‘నేల అడుగు నుంచి మొసళ్లు ఎలా వచ్చాయబ్బా’’.. అంటూ మరికొందరు, ‘‘ఇది నిజమా, లేక గ్రాఫిక్సా’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 42వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Father: బాబోయ్.. ఇదేం ట్విస్టు.. 3 ఏళ్ల కొడుకుతో కలిసి స్కూటీపై ఓ భార్య వెళ్తోంటే.. సడన్‌గా భర్త ఎంట్రీ.. పిల్లాడిని కిడ్నాప్ చేసి..

Updated Date - 2023-08-09T21:44:05+05:30 IST