పెళ్లి తర్వాత ఇలాగే జరగాలంటూ వధువు వింత కోరిక.. వరుడి తండ్రి కూడా ఒప్పుకోవడంతో.. చివరకు అంతా కలిసి..

ABN , First Publish Date - 2023-02-25T17:05:58+05:30 IST

వివాహ కార్యక్రమాల్లో చోటు చేసుకునే వింత వింత ఘటనలు ఇటీవల తెగ వైరల్ అవుతున్నాయి. వధూవరులు కాస్త వెరైటీగా ఏం చేసినా.. నెట్టింట ట్రెండింగ్‌గా మారుతోంది. వధూవరులు వింత వింత వాహనాలపై కళ్యాణ మంటపాలకి చేరుకోవడం, స్నేహితులంతా..

పెళ్లి తర్వాత ఇలాగే జరగాలంటూ వధువు వింత కోరిక.. వరుడి తండ్రి కూడా ఒప్పుకోవడంతో.. చివరకు అంతా కలిసి..

వివాహ కార్యక్రమాల్లో చోటు చేసుకునే వింత వింత ఘటనలు ఇటీవల తెగ వైరల్ అవుతున్నాయి. వధూవరులు కాస్త వెరైటీగా ఏం చేసినా.. నెట్టింట ట్రెండింగ్‌గా మారుతోంది. వధూవరులు వింత వింత వాహనాలపై కళ్యాణ మంటపాలకి చేరుకోవడం, స్నేహితులంతా కలిసి వధూవరులను ఆటపట్టించడం, చివరకు వధువు కూడా వేదికపై వివిధ రకాల ప్రాంక్‌లు చేయడం.. సర్వసాధారణమైంది. ప్రస్తుతం ఓ వధువు వివాహం అనంతరం వింత కోరిక కోరింది. ఇందుకు వరుడి తండ్రి కూడా ఒప్పుకోవడంతో అంతా కలిసి ఏం చేశారంటే..

రాజస్థాన్‌లోని (Rajasthan) పెద్దా గ్రామానికి చెందిన ఘనశ్యామ్ మీనా కుమార్తె కిస్మత్ అనే యువతికి.. మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లా పరిధి సోనికాలన్ పట్టణానికి చెందిన హరిసింగ్ మీనా కుమారుడు ఆకాష్‌తో వివాహం (marriage) నిశ్చయమైంది. రెండు రోజుల క్రితం రాజస్థాన్‌లోని పెద్దా గ్రామంలో వివాహం ఘనంగా జరిగింది. రెండు కుటుంబాలూ ఆర్థికంగా స్థితిమంతులు కావడంతో చాలా ఖర్చు చేసి అంతా ఆశ్చర్యపోయేలా పెళ్లిని జరిపించారు. వివాహానంతరం వధువును అత్తగారింటికి సాగనంపే సమయం ఆసన్నమైంది. అయితే ఇదే సమయంలో వధువు వింత కోరిక కోరింది. తన చిన్నతనంలో వధువులను హెలీకాప్టర్‌లో (Helicopter) తీసుకురావడం చూసిందట. అప్పటి నుంచి తన వివాహానంతరం అత్తగారింటికి పడవలో ప్రయాణం చేయాలని కోరిక ఉండేదట.

12 మంది శిశువులు కడుపులో ఉంటే.. 6 గంటల పాటు కష్టపడి అరుదైన ఆపరేషన్ చేసిన వైద్యులే నివ్వెరపోయారు..!

rajastan-viral-news.jpg

ఇదే విషయాన్ని తన తండ్రికి చెప్పింది. చివరకు వరుడి తండ్రిని పిలిచి తమ కోరిక బయటపెట్టారు. వారు కూడా అంగీకరించడంతో సుమారు 50మంది అతిథుల కోసం మూడు పెద్ద పడవలను సిద్ధం చేశారు. తన కోరికను అంతా ఒప్పుకోవడంతో వధువు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పడవల్లో ఎక్కగానే తన ఆనందాన్ని డాన్స్ రూపంలో వ్యక్తం చేసింది. వరుడితో పాటూ తానూ సంతోషంగా స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకుంది. పడవల్లో అత్తగారింటికి ఊరేగింపుగా వెళ్లిన వధువు (Brides wedding procession in a boat) గురించి.. స్థానింగా అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో (Viral photos and videos) తెగ వైరల్ అవుతున్నాయి.

OYO Rooms: అమ్మ బాబోయ్.. ఓయో రూమ్స్‌ను ఇలాంటి పనులకు కూడా వాడుతున్నారా..? పోలీసుల రైడింగ్‌తో వెలుగులోకి విస్తుపోయే నిజాలు..!

Updated Date - 2023-02-25T17:06:04+05:30 IST