Viral news: పొలంలో కాపలా కాస్తున్న ఎలుగుబంటిని చూసి అంతా షాక్.. చివరకు రూ.4,000లతో రైతులు చేసిన పని చూసి అవాక్కవుతున్న నెటిజన్లు..

ABN , First Publish Date - 2023-06-25T15:37:13+05:30 IST

ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. ఎదురుచూసి మోసపోకుమా.. అని ఓ సినీ కవి అన్నట్లు.. సమస్య పరిష్కారానికి ఇంకొంకరి మీద ఆధారపడకుండా ముందు తమ వంతు కృషి చేస్తే ప్రయోజనం ఉంటుంది. ఇందుకు తగ్గట్టుగానే కొందరు ఎంత పెద్ద సమస్యనైనా చిన్న చిన్న టెక్నిక్‌లతో ...

Viral news: పొలంలో కాపలా కాస్తున్న ఎలుగుబంటిని చూసి అంతా షాక్.. చివరకు రూ.4,000లతో రైతులు చేసిన పని చూసి అవాక్కవుతున్న నెటిజన్లు..

ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. ఎదురుచూసి మోసపోకుమా.. అని ఓ సినీ కవి అన్నట్లు.. సమస్య పరిష్కారానికి ఇంకొంకరి మీద ఆధారపడకుండా ముందు తమ వంతు కృషి చేస్తే ప్రయోజనం ఉంటుంది. ఇందుకు తగ్గట్టుగానే కొందరు ఎంత పెద్ద సమస్యనైనా చిన్న చిన్న టెక్నిక్‌లతో పరిష్కరించుకుంటుంటారు. ఇలాంటి వినూత్న ఆలోచలనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో రైతులు ఇలాగే చేశారు. పొలంలో కాపలా కాస్తున్న ఎలుగుబంటిని చూసి అంతా షాక్ అయ్యారు. చివరకు రూ.4,000 ఖర్చుతో రైతులు చేసిన పని చూసి అవాక్కవుతున్నారు. వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లఖింపూర్ ఖేరి ప్రాంత పరిధి జహాన్ నగర్ గ్రామానికి చెందిన రైతుల తెలివితేటలు చూసి స్థానికులతో పాటూ చుట్టు పక్కల వారంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక్కడి రైతులు కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా ఏ పంటలు వేసినా కోతులు నాశనం చేస్తుండడంతో ఏళ్లుగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సుమారు 40 నుంచి 45 కోతుల వరకూ రోజూ పంటలపై దాడులు చేసి నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. కోతుల (Monkeys) బెడదను నివారించాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో.. అంతా కలిసి చివరకు ఓ నిర్ణయం తీసుకున్నారు. సుమారు రూ.4,000 ఖర్చు చేసి ఎలుగుబంటి దుస్తులను (Bear costume) కొనుగోలు చేశారు.

Viral Video: చిరుత నుంచి తప్పించుకుని కారు వద్ద సేదతీరుతున్న జింక.. భయంతో చాలా సేపు ఎదురు చూసిన పులి.. చివరకు ఏమైందంటే..

Farmer-trending-news.jpg

ఈ డ్రస్సు వేసుకుని పొలాల్లో తిరుగుతుండడంతో కోతులు భయపడి పారిపోతున్నాయి. దీంతో చుట్టు పక్కల రైతులంతా తమ పొలాల్లో ఇలాగే చేస్తున్నారు. ప్రస్తుతం కోతుల బెడద తప్పిందని, అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని రైతులు కోరుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు మాట్లాడుతూ రైతుల సమస్య తమ దృష్టికి వచ్చిందని, కోతుల బెడదను నివారించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, ఎలుగుబంటి డ్రస్సు వేసుకున్న రైతు ఫొటోలు సోషల్ మీడియాలో (Viral photos) తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్! ఏం ఐడియా గురూ’’.. అని కొందరు, ‘‘అడవులను సంరక్షిస్తే ఇలాంటి సమస్యలు ఉండవు’’.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Bride Video: కాసేపట్లో పెళ్లనగా పెళ్లికూతురి ఎంట్రీ.. నేరుగా పెళ్లిపీటలపైకి ఎక్కకుండా వధువు చేసిన పనికి నివ్వెరపోయిన బంధువులు..!

Updated Date - 2023-06-25T15:37:13+05:30 IST