Bride Video: కాసేపట్లో పెళ్లనగా పెళ్లికూతురి ఎంట్రీ.. నేరుగా పెళ్లిపీటలపైకి ఎక్కకుండా వధువు చేసిన పనికి నివ్వెరపోయిన బంధువులు..!

ABN , First Publish Date - 2023-06-23T16:40:20+05:30 IST

సినిమాల్లో పెళ్లి సన్నివేశాలను చాలా అందంగా చూపిస్తుంటారు. అయితే ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో నిజ జీవితంలోనూ వివాహ కార్యక్రమాలను అంతే అందంగా, ఘనంగా నిర్వహించడం చూస్తూనే ఉన్నాం. ఇక సందడి విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుడితో పాటూ...

Bride Video: కాసేపట్లో పెళ్లనగా పెళ్లికూతురి ఎంట్రీ.. నేరుగా పెళ్లిపీటలపైకి ఎక్కకుండా వధువు చేసిన పనికి నివ్వెరపోయిన బంధువులు..!

సినిమాల్లో పెళ్లి సన్నివేశాలను చాలా అందంగా చూపిస్తుంటారు. అయితే ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో నిజ జీవితంలోనూ వివాహ కార్యక్రమాలను అంతే అందంగా, ఘనంగా నిర్వహించడం చూస్తూనే ఉన్నాం. ఇక సందడి విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుడితో పాటూ వధువు కూడా ప్రాంక్‌లు చేయడం, డాన్సులు వేయడం సర్వసాధారణమైంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ వధువుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కాసేపట్లో పెళ్లనగా వధువు లోపలికి ఎంట్రీ ఇచ్చింది. అయితే నేరుగా పెళ్లి పీటల పైకి ఎక్కకుండా ఉన్నట్లుండి ఆమె చేసిన పనికి అక్కడున్న వారంతా నివ్వెరపోయారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. కళ్యాణ మంటపం (wedding hall) అతిథులందరితో సందడి సండిగా ఉంటుంది. ఇంతలో ముహూర్థ సమయం రానే వచ్చింది. అంతా వధువు కోసం వేచి చూస్తూ ఉంటారు. కాసేపటికి స్నేహితులతో లోపలికి ఎంట్రీ ఇచ్చిన వధువు.. ఉన్నట్టుండి అందరికీ షాక్ ఇస్తుంది. పెళ్లి పీటల పైకి వెళ్లకుండా ఉన్నట్టుండి అక్కడే ఆగిపోతుంది. దీంతో అక్కడున్న వారంతా.. ఆమె ఏం చేస్తుందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటారు. అంతలో ఆమె అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఒక్కసారిగా (Bride dance) డాన్స్ వేస్తుంది. తర్వాత ఆమె వెనుక ఉన్న స్నేహితులు కూడా జత కలుస్తారు. అంతా కలిసి లయబద్ధమైన స్టెప్పులతో అందరినీ అలరిస్తారు.

Snake: ఏంటమ్మా.. ఈ పామును ఆస్పత్రికి ఎందుకు తెచ్చావన్న డాక్టర్లు.. 60 ఏళ్ల ఆ బామ్మ చెప్పింది విని..!

వధువు ఏమాత్రం సిగ్గు పడకుండా అదిరిపోయే స్టెప్పులు వేయడం చూసి.. అతిథులంతా తమ కెమెరాల్లో వీడియోలు, ఫొటోలు (Videos and photos) తీసుకునేందుకు పోటీపడ్డారు. ఆమె డాన్స్‌తో కళ్యాణ మంటపంలో అప్పటిదాకా ఉన్న సందడి కాస్త రెట్టింపు అయింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. ‘‘వావ్! ఈ వధువు డాన్స్ సూపర్’’.. అని కొందరు, ‘‘ఎక్సలెంట్ కొరియోగ్రఫీ.. ఎక్సలెంట్ ఎక్స్‌ప్రెషన్స్’’.. అని మరికొందరు, ‘‘వధువు సంతోషం చూస్తుంటే ముచ్చటేస్తోంది’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వేలల్లో లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: 22 సెకన్ల నిడివి ఉన్న స్కూటీ వీడియో.. చూసి అవాక్కవుతున్న నెటిజన్లు.. అందరి నోటా ఒకే ఒక్క ప్రశ్న..!

Updated Date - 2023-06-23T16:40:20+05:30 IST