Viral Video: ఇంత చిన్న వయసులోనే ఎన్ని కష్టాలొచ్చాయి బిడ్డా..? నెటిజన్లను కట్టిపడేస్తున్న వీడియో ఇది..!

ABN , First Publish Date - 2023-06-22T19:09:37+05:30 IST

చిన్న వయసు పిల్లలకు ఆడుకోవడం తప్ప మరేమీ తెలీదు. అయితే కొందరు పిల్లలు మాత్రం శ్రద్ధగా చదువుకుంటూ తల్లిదండ్రులకు పేరు తెస్తుంటారు. ఇంకొందరు పిల్లలు తల్లిదండ్రుల బాధ్యతలను కూడా తమ మీద వేసుకుని కష్టపడుతుంటారు. ఇలాంటి పిల్లలను చూసినప్పుడు అయ్యో పాపం! అని అనిపిస్తుంటుంది. ప్రస్తుతం..

Viral Video: ఇంత చిన్న వయసులోనే ఎన్ని కష్టాలొచ్చాయి బిడ్డా..? నెటిజన్లను కట్టిపడేస్తున్న వీడియో ఇది..!

చిన్న వయసు పిల్లలకు ఆడుకోవడం తప్ప మరేమీ తెలీదు. అయితే కొందరు పిల్లలు మాత్రం శ్రద్ధగా చదువుకుంటూ తల్లిదండ్రులకు పేరు తెస్తుంటారు. ఇంకొందరు పిల్లలు తల్లిదండ్రుల బాధ్యతలను కూడా తమ మీద వేసుకుని కష్టపడుతుంటారు. ఇలాంటి పిల్లలను చూసినప్పుడు అయ్యో పాపం! అని అనిపిస్తుంటుంది. ప్రస్తుతం ఇలాంటి పిల్లాడికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాలికి దెబ్బ తగిలినా ప్లాస్టిక్ కవర్లు చుట్టుకుని మరీ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఈ బుడ్డోడిని చూసి.. ఇంత చిన్న వయసులోనే ఎన్ని కష్టాలొచ్చాయి బిడ్డా.. అని నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు.

గుజరాత్‌లో (Gujarat) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ట్రాఫిక్ పాయింట్ వద్ద కనిపించిన హృదయ విదారక దృశ్యం చూసి అంతా.. అయ్యో! పాపం అని అన్నీటిపర్యంతమయ్యారు. కీచైన్లు (Keychains) విక్రయిస్తున్న ఓ పిల్లాడు.. రోడ్డు పక్కన ఫుట్‌పాత్ మీద కూర్చుని సరిచూసుకుంటున్నాడు. బాలుడి కుడి కాలికి (injured boy) గాయమైంది. దీంతో కాలికి ప్లాస్టిక్ పేపర్లు చుట్టుకుని మరీ కీచైన్లు విక్రయిస్తున్నాడు. ఓ వైపు గాయం నొప్పి ఉన్నా.. మరో వైపు తన కర్తవ్యాన్ని మాత్రం మర్చిపోకుండా కీచైన్లు విక్రయిస్తున్నాడు. ఆ సమయంలో బైకులో అక్కడికి వచ్చిన ఓ వాహనదారుడు బాలుడిని చూసి చలించిపోయాడు. బైకు ఆపి మరీ దగ్గరికి పిలిచాడు.

Viral Video: ఒకే స్కూటీపై ఏకంగా 8 మంది.. వెనుక నుంచి నెమ్మదిగా వచ్చి వీడియోను తీశాడో వ్యక్తి.. నెట్టింట పోస్ట్ చేస్తే..!

బైకుపై ఉన్న వ్యక్తిని చూడగానే బాలుడు ఆశగా పైకి లేచి.. కుంటుకుంటూనే దగ్గరకు వచ్చి.. ‘‘కీచైన్లు కావాలా సర్.. తీసుకోండి సర్’’.. అని అన్నాడు. వీడియో అంతటితో ముగుస్తుంది. బాలుడి పరిస్థితి చూసి బాధపడ్డ అతను.. వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భావోద్వేగంతో కూడిన కామెంట్లు చేస్తున్నారు. ‘‘అయ్యో! పాపం ఎంత కష్టం వచ్చింది’’.. అని కొందరు, ‘‘ముందు పిల్లాడికి చికిత్స చేయించండి’’.. అని మరికొందరు, ‘‘బాబు కుటుంబానికి అంతా అండగా నిలవాలి’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో లైకులను సొంతం చేసుకుంది.

Viral Video: ఓరి దేవుడో.. ఇదేం మాయాజాలం.. ఈ ఫొటోలో కనిపిస్తున్న కుర్రాడు.. ఆ యువతి ఎవరో కాదండోయ్..!

Updated Date - 2023-06-22T19:44:10+05:30 IST