Share News

Viral Video: వృద్ధురాలు అని కూడా చూడకుండా.. ఈ కోడలు ఏం చేసిందో చూడండి..

ABN , Publish Date - Dec 15 , 2023 | 08:33 PM

సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న కొందరు ఇంట్లో మాత్రం శాడిస్టుల్లా ప్రవర్తిస్తుంటారు. కొందరైతే చిన్నపిల్లలని కూడా చూడకుండా రాక్షసంగా ప్రవర్తించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా..

Viral Video: వృద్ధురాలు అని కూడా చూడకుండా.. ఈ కోడలు ఏం చేసిందో చూడండి..

సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న కొందరు ఇంట్లో మాత్రం శాడిస్టుల్లా ప్రవర్తిస్తుంటారు. కొందరైతే చిన్నపిల్లలని కూడా చూడకుండా రాక్షసంగా ప్రవర్తించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా కేరళలో ఓ మహిళా టీచర్ తన అత్తగారి పట్ల దారుణంగా ప్రవర్తించింది. కనీసం వృద్ధురాలు అని కూడా చూడకుండా చిత్రహింసలకు గురి చేసింది. వీడియో వైరల్ అవడంతో పోలీసులు ఆమెను గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..

కేరళ ( Kerala) తేవలక్కరలోని నడువిలక్కర ప్రాంత పరిధి కొల్లాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 37 ఏళ్ల ఓ మహిళ.. టీచర్‌గా (female teacher) పని చేస్తుంటుంది. పదిమందికి ఆదర్శంగా నిలవాల్సిన ఈమె అందకు విరుద్ధంగా ప్రవర్తించి.. అందరితో ఛీకొట్టించుకుంటోంది. వృద్ధురాలైన అత్తపై ఏమాత్రం కనికరం లేకుండా దాడి చేసింది. భర్త ఎదుటే ఈ దారుణానికి పాల్పడడం చూసి (Daughter-in-law assault on mother-in-law) అంతా నివ్వెరపోతున్నారు. కుర్చీలో కూర్చుని ఉన్న వృద్ధురాలిని బయటికి పొమ్మంటూ సదరు టీచర్ తిడుతూ ఉంటుంది. అంతటితో ఆగకుండా పిల్లలకూ నేర్పించి, వృద్ధురాలిని బయటికి పంపించాలని చూస్తుంది.

Optical illusion: ఈ గ్రామంలో సింహం దాక్కుని ఉంది.. కనిపెట్టగలిగితే మీ చూపు తీక్షణంగా ఉన్నట్లే..

దీంతో వృద్ధురాలు తలుపు వద్దకు వెళ్లి , అక్కడ కొద్ది సేపు కూర్చోవడంతో కోడలికి కోపం కట్టలు తెంచుకుంటుంది. మళ్లీ దగ్గరకు వచ్చి గట్టిగా కొడుతూ కిందకు తోసేస్తుంది. అలా తోసేయడంతో వృద్ధురాలు ధమేల్‌మని ఇంటి గడపపై పడిపోతుంది. కాసేపటికి పైకి లేచి కూర్చుని చేతికి తగిలిన దెబ్బలు చూసుకుంటూ బాధను దిగమింగుకుంటుంది. ఇవతలి గదిలో ఉన్న కొడుకేమో ఈ ఘటనను మొత్తం వీడియో తీస్తూ ఉంటాడు. అతడు వీడియో తీయాన్ని చూసిన సదరు మహిళ.. అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ‘‘ఏం చేసుకుంటావో చేస్కో’’.. అన్నట్లుగా ప్రవర్తిస్తుంది. చివరకు వృద్ధురాలు ఎలాగోలా పైకి లేచి, ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతుంది. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవడంతో పోలీసులు అలెస్ట్ అయ్యారు. కొన్ని గంటల్లోనే ఆమెను అరెస్ట్ చేసి, స్టేషన్‌కి తరలించారు. మరోవైపు ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Viral Photo: ఇది మీ కంటికి పరీక్ష.. ఇందులో ఎలుక ఎక్కడ దాక్కుందో చెప్పగిలిగితే మీరు నిజంగా గ్రేటే..

Updated Date - Dec 15 , 2023 | 08:33 PM