Wife-Husband: భార్య ప్రవర్తనపై భర్తకు డౌట్.. ఆమె ఫోన్ నుంచే ఓ నెంబర్‌కు పంపాడో వెరైటీ మెసేజ్.. ఏం రిప్లై వచ్చిందో చూస్తే..!
ABN , First Publish Date - 2023-11-10T21:22:49+05:30 IST
దంపతుల మధ్య ఎలాంటి గొడవలు తలెత్తినా మళ్లీ కొంత సమయానికి కలిసిపోవడం మామూలే. అయితే ఒకరిపై ఇంకొంకరు అనుమానం పెంచుకోవడం వల్ల లేనిపోని సమస్యలు వస్తుంటాయి. భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని భార్య.. భార్యను తప్పును ఎత్తి చూపాలని భర్త.. శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి...
దంపతుల మధ్య ఎలాంటి గొడవలు తలెత్తినా మళ్లీ కొంత సమయానికి కలిసిపోవడం మామూలే. అయితే ఒకరిపై ఇంకొంకరు అనుమానం పెంచుకోవడం వల్ల లేనిపోని సమస్యలు వస్తుంటాయి. భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని భార్య.. భార్యను తప్పును ఎత్తి చూపాలని భర్త.. శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటాయి. మరికొన్నిసార్లు సీరియస్ కాస్తా.. ఫన్నీగా మారుతుంటుంది. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ‘‘జాగ్రత్త.. నా భర్తకు మనపై అనుమానం వచ్చింది’’.. అంటూ ఓ వ్యక్తికి మెసేజ్ వచ్చింది. దీంతో చివరకు అతడు ఎలాంటి రిప్లై ఇచ్చాడంటే..
సోషల్ మీడియాలో ఓ వార్త (Viral news) తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ వ్యక్తికి తన భార్యపై (Suspicion on wife) అనుమానం పుట్టికొచ్చింది. తను ఎవరితోనే రోజూ చాటింగ్ (Chatting) చేస్తోందని అనుమానం పెంచుకున్నాడు. ఎలాగైనా అవతలి వ్యక్తి ఎవరో తేల్చుకోవాలని ప్లాన్ వేశాడు. ఓ రోజు భార్య లేని సమయంలో ఆమె ఫోన్ తీసుకుని తనకు అనుమానం వచ్చిన నంబర్లకు మెసేజ్ చేయసాగాడు. ముందుగా ఓ వ్యక్తికి.. ‘‘జాగ్రత్త.. నా భర్తకు మనపై.. అనుమానం వచ్చింది’’.. అంటూ మెసేజ్ చేశాడు. దీంతో అవతలి వ్యక్తి వెంటనే.. ‘‘అనుమానం ఏంటీ.. అసలు నేను మీకు తెలుసా?’’.. అంటూ రిప్లై ఇచ్చాడు.
దీనికి మహిళ భర్త.. ‘‘నేను ఆమె భర్తను... ఇప్పుడు మీరు నా అనుమానిత జాబితా నుంచి బయటపడ్డారు’’.. అని మెసేజ్ చేశాడు. ఇందుకు అవతలి వ్యక్తి.. తనకు ఏమీ అర్థం కానట్లుగా చుక్కలతో కూడిన ఖాళీ సందేశం పంపించాడు. తర్వాత మహిళ భర్త ఇంకాస్త తెలివిగా ఆలోచించి.. ‘‘ఇందాక నా భర్త మెసేజ్ చేశాడు.. అదృష్టం బాగుండబట్టి నువ్వే చెప్పలేదు కాబట్టి సరిపోయింది’’.. అంటూ సందేశం పంపించాడు. ఇందుకు అవతలి వ్యక్తి... ‘‘చెప్పేదేంటి? అసలు నువ్వెవరో కూడా నాకు తెలీదు’’.. అంటూ సమాధానం ఇచ్చాడు. ‘‘నేను ఆమె భర్తనేలే.. నువ్వు చెప్పేది నిజమో కాదో తెలుసుకునేందుకు మళ్లీ మెసేజ్ చేశా..’’.. అని సమాధానం ఇచ్చాడు. కాగా, ఈ చాటింగ్‌కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.