Crime: బీహార్‌లో ఓ ప్రైవేటు స్కూల్‌ ఉపాధ్యాయుడిని.. పక్కా ప్లాన్‌తో అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు.. అతడి కథేంటో తెలిస్తే..!

ABN , First Publish Date - 2023-08-23T18:22:04+05:30 IST

కొందరు నిజ జీవిత కథలను ఆధారం చేసుకుని సినిమాలు తీస్తుంటే.. మరికొందరు సినిమాలను చూసి ఇన్‌స్పైర్ అవుతుంటారు. ఈ క్రమంలో కొందరు వారి ప్రతిభకు పదును పెట్టి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటుంటారు. అలాగే మరికొందరు అదే సినిమాలను చూసి..

Crime: బీహార్‌లో ఓ ప్రైవేటు స్కూల్‌ ఉపాధ్యాయుడిని.. పక్కా ప్లాన్‌తో అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు.. అతడి కథేంటో తెలిస్తే..!
ప్రతీకాత్మక చిత్రం

కొందరు నిజ జీవిత కథలను ఆధారం చేసుకుని సినిమాలు తీస్తుంటే.. మరికొందరు సినిమాలను చూసి ఇన్‌స్పైర్ అవుతుంటారు. ఈ క్రమంలో కొందరు వారి ప్రతిభకు పదును పెట్టి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటుంటారు. అలాగే మరికొందరు అదే సినిమాలను చూసి వివిధ రకాల నేరాలకు పాల్పడి జైలుపాలవుతుంటారు. ఇలాంటి ఘటనలు మన చుట్టూ ఎక్కడో చోట నిత్యం చోటు చేసుకుంటూనే ఉంటాయి. తాజాగా, బీహార్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తెలంగాణ పోలీసులు.. బీహార్‌లోని ప్రైవేటు స్కూల్‌ ఉపాధ్యాయుడిని పక్కా ప్లాన్‌తో అరెస్ట్ చేశారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

బీహార్ (Bihar) దర్భంగాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దర్భంగా జిల్లాకు చెందిన శైలేష్ కుమార్ అనే వ్యక్తి.. సుపాల్-శివనగర్ ఘాట్ ప్రధాన రహదారిలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తుంటాడు. ఇతను ఇక్కడే ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నా.. గతంలో శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా (Shankar Dada MBBS movie) తరహాలో తెలంగాణలో (Telangana) జరిగిన పరీక్షల్లో వేరే అభ్యర్థికి బదులుగా ఎంబీబీఎస్ పరీక్ష (MBBS Exam) ఇతను రాశాడు. దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ సీఐడీ పోలీసులు (CID Police) .. చివరకు శైలేష్ కుమార్ నిందితుడిగా గుర్తించారు. అతడి గురించి ఆరా తీసిన పోలీసులు.. ఇటీవల దర్భంగా జిల్లా బీరౌల్ ప్రాంతానికి చేరుకుంది.

Shocking: బస్సు కోసం ఎదురు చూస్తున్న భార్యాభర్తలు.. సడన్‌గా పక్కనే వచ్చి ఆగిందో కారు.. తెలిసిన వ్యక్తే కదా అని ఎక్కితే..!

bihar-crime.jpg

నేరుగా ప్రైవేట్ పాఠశాలలోకి వెళ్లడంతో ఉపాధ్యాయులతో పాటూ మిగతా వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. పాఠశాల యాజమాన్యానికి విషయం తెలియజేసిన పోలీసులు.. చివరికి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఇంకా ఏయే ప్రాంతాల్లో ఇలాంటి నేరాలకు పాల్పడ్డాడు.. ఇలాంటి వారు ఇంకెంతమంది ఉన్నారు.. తదితర కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మున్నాబాయ్ ఎంబీబీఎస్ సినిమా చూసి ఇన్‌స్పైర్ అయినట్టున్నాడు’’.. అని కొందరు, ‘‘ఇలాంటి వారి వల్లే నకిలీ వైద్యులు పుట్టుకొస్తున్నారు’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి పనులు ఇంకోసారి చేయకుండా కఠినంగా శిక్షించాలి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Mother: రాత్రి 10 గంటల సమయం.. తల్లి చేతిలో మొబైల్‌ను చూసిన 17 ఏళ్ల కుర్రాడు.. తెల్లారేసరికి షాకింగ్ సీన్..!

Updated Date - 2023-08-23T18:23:31+05:30 IST