Viral Video: ఈ ప్రేమలో కల్మషం ఉండదు గురూ.. తరగతి గదిలోకి రాగానే స్నేహితుల షాకింగ్ సర్‌ప్రైజ్.. చూసి కన్నీళ్లు పెట్టుకుంటోంటే..!

ABN , First Publish Date - 2023-09-19T15:16:29+05:30 IST

రోజురోజుకూ మానవత్వం కనుమరగవుతున్న ప్రస్తుత తరుణంలో.. మంచితనం ఇంకా బతికే ఉందని కొందరు నిరూపిస్తుంటారు. కొందరు కష్టాల్లో ఉన్న వారిని చూసి చలించిపోతుంటారు. ఈ క్రమంలో తమకు తోచినంత సాయం చేసేవారు కొందరైతే.. మరికొందరు కల్మషం లేని ప్రేమ చూపిస్తూ..

Viral Video: ఈ ప్రేమలో కల్మషం ఉండదు గురూ.. తరగతి గదిలోకి రాగానే స్నేహితుల షాకింగ్ సర్‌ప్రైజ్.. చూసి కన్నీళ్లు పెట్టుకుంటోంటే..!

రోజురోజుకూ మానవత్వం కనుమరగవుతున్న ప్రస్తుత తరుణంలో.. మంచితనం ఇంకా బతికే ఉందని కొందరు నిరూపిస్తుంటారు. కొందరు కష్టాల్లో ఉన్న వారిని చూసి చలించిపోతుంటారు. ఈ క్రమంలో తమకు తోచినంత సాయం చేసేవారు కొందరైతే.. మరికొందరు కల్మషం లేని ప్రేమ చూపిస్తూ, మంచి మంచి మాటలతో వారిలో మనోధైర్యాన్ని నింపుతుంటారు. ఇలాంటి అరుదైన ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ విద్యార్థికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ పిల్లాడు ఏడ్చుకుంటూ తరగతి గదిలోకి వచ్చాడు. చివరకు అతడి సమస్యను తెలుసుకున్న టీచర్లు, విద్యార్థులు కలిసి బాలుడికి షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ విద్యార్థి (student) పాఠశాల తరగతి గదిలోకి (classroom) ఆలస్యంగా వస్తాడు. దీంతో టీచర్.. ఎందుకు ఆలస్యమైందని అడుగుతుంది. ‘‘ఈ రోజు నా బర్త్‌డే.. మాది పేద కుటుంబం.. అందుకే చిన్నప్పటి నుంచి ఎప్పుడూ వేడుక చేసుకోలేదు’’.. అని చెప్పగానే ఒక్కసారిగా టీచర్ చలించిపోతుంది. వెంటనే పిల్లాడికి ధైర్యం చెప్పి.. ‘‘నీకు మేమంతా ఉన్నాం.. నీ పుట్టిన రోజును (Birthday) ఘనంగా చేస్తాం’’.. అంటూ అతడి బాధను పోగొడుతుంది. దగ్గరుండి మరీ తరగతి గదిలోకి తీసుకెళ్తుంది.

Crime news: ‘‘మీ భర్తకు చేతబడి జరిగింది’’.. అని స్నేహితులే చెప్పడంతో కంగారుగా వెళ్లిన భార్య.. చివరకు వారు చెప్పినట్లే పూజలో కూర్చోవడంతో..

తరగతి గది లోపలికి వెళ్లగానే మరికొందరు టీచర్లు, విద్యార్థులు కలిసి సడన్‌గా అతడి ముందుకు వచ్చి ‘‘హ్యాపీ బర్త్‌డే’’.. అంటూ విష్ చేస్తారు. దీంతో అప్పటిదాకా బాధపడుతున్న విద్యార్థిలో ఎక్కడలేని సంతోషం కనిపిస్తుంది. తర్వాత తోటి విద్యార్థులంతా ఒక్కొక్కరుగా వెళ్లి.. సదరు విద్యార్థిని కౌగిలించుకుని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. బర్త్‌డే బాయ్‌కి.. శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: తలలో లక్షలాది పేలతో హెయిర్ కేర్ సెంటర్‍కి వెళ్లిన యువతి.. వారు చేసిన చిన్న చిట్కాతో చివరికి ఏమైందో చూడండి..

Updated Date - 2023-09-19T15:16:29+05:30 IST