Shocking video: వామ్మో! నిషేధిత ప్రాంతంలో వ్యక్తి ఈత కొడుతుండగా.. చివరకు ఉన్నట్టుండి ప్రమాదం ఏ రూపంలో వచ్చిందో మీరే చూడండి..

ABN , First Publish Date - 2023-06-09T19:57:41+05:30 IST

కొందరు తెలీక చేస్తే.. మరికొందరు తెలిసి తెలిసి తప్పులు చేస్తుంటారు. అలాగే నిబంధనలు ఉల్లఘించే క్రమంలో చాలా మంది చివరకు ప్రమాదాల బారిన పడడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో కొన్నిసార్లు ఊహించని విధంగా ప్రాణ నష్టం సంభవిస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ దర్శనమిస్తుంటాయి. ప్రస్తుతం..

Shocking video: వామ్మో! నిషేధిత ప్రాంతంలో వ్యక్తి ఈత కొడుతుండగా.. చివరకు ఉన్నట్టుండి ప్రమాదం ఏ రూపంలో వచ్చిందో మీరే చూడండి..

కొందరు తెలీక చేస్తే.. మరికొందరు తెలిసి తెలిసి తప్పులు చేస్తుంటారు. అలాగే నిబంధనలు ఉల్లఘించే క్రమంలో చాలా మంది చివరకు ప్రమాదాల బారిన పడడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో కొన్నిసార్లు ఊహించని విధంగా ప్రాణ నష్టం సంభవిస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ దర్శనమిస్తుంటాయి. ప్రస్తుతం ఇలాంటి ఘనటకు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి నిషేధిత ప్రాంతంలో ఈత కొడుతుంటాడు. చివరకు ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఈజిప్ట్‌లోని (Egypt) హుర్ఘడాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఎర్ర సముద్రాన్ని (Red Sea) వీక్షించేందుకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు నిత్యం వస్తూ ఉంటారు. దీంతో ఇక్కడి రిసార్ట్‌లు (Resorts) ఎంతో ప్రసిద్ధి చెందాయి. అయితే ఇక్కడి సముద్ర జలాల్లో ఈత కొట్టడం, ఇతర కార్యకలాపాలపై అధికారులు నిషేధం (Ban on swimming) విధించారు. జూన్ 8న 24 ఏళ్ల ఓ రష్యన్‌కు వ్యక్తి (Russian man) ఊహించని ప్రమాదానికి గురయ్యాడు. ఇక్కడి నిబంధనలు ఉల్లంఘించి మరీ సముద్రంలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. అయితే కొద్ది సేపు ఈత కొట్టగానే ఓ టైగర్ సొరచేప అక్కడికి వచ్చింది. వచ్చీ రాగానే అతడిపై దాడికి దిగింది. ఊహించని ఈ ప్రమాదానికి షాక్ అయిన వ్యక్తి.. దాని నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు.

Metro Train: మెట్రో రైల్లో కుర్రాళ్ల బ్యాచ్.. డోర్ల వద్ద కావాలనే నిల్చుని పిచ్చి చేష్టలు.. సీక్రెట్‌గా ఓ వ్యక్తి వీడియో తీయడంతో..!

వేగంగా ఈత కొడుతూ సొరచేప నుంచి దూరంగా వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయినా వదలని టైగర్ షార్క్ అతడిని (Tiger Shark attack on young man) వెంబడించి మరీ దాడి చేసింది. చివరగా అతడిని నోట కరుచుకుని నీటిలోకి తీసుకెళ్లింది. దీన్ని గమనించిన సిబ్బంది అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తాడు. అయితే సమీపానికి వచ్చే సరికే సొరచేప అతన్ని చంపేసింది. టైగర్ సొరచేపను బంధించామని, ఇకపై ఇలాంటి పనులు ఎవరూ చేయొద్దని ఈజిప్ట్ భద్రతా వర్గాలు సూచించాయి. టైగర్ సొరచేపలు ఉష్ణమండల, సమశీతోష్ణ జలాల్లో ఎక్కువగా ఉంటాయని, వాటి వల్ల ప్రమాదం పొంచి ఉండడంతో ఇక్కడి సముద్ర జలాల్లో ఈత కొట్టడాన్ని నిషేధించినట్లు పేర్కొన్నారు. కాగా, టైగర్ సొరచేప దాడికి సంబంధించిన వీడియో (Viral video) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: వారెవ్వా.. తెలివంటే నీదే కదా బ్రదర్.. పాత కారులో ఒక్క చిన్న మార్పు చేసి.. ట్రెండ్‌లోకి వచ్చేలా చేశాడుగా..!

Updated Date - 2023-06-09T19:57:41+05:30 IST