Viral Video: కరెంట్ లేకున్నా.. దుస్తులను ఇస్త్రీ చేస్తున్న ఈమె తెలివిని చూస్తే.. ముక్కున వేలేసుకుంటారు..

ABN , First Publish Date - 2023-07-05T20:09:40+05:30 IST

కొందరి ఆలోచనా విధానం, వారు చేసే పనులు విచిత్రంగా అనిపిస్తుంటాయి. ఇంకొందరు వినూత్నంగా ఆలోచిస్తూ చేసే పనులు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇలాంటి వారిని చూసినప్పుడు.. అరె! ఇలాంటి ఆలోచన మనకెందుకు రాలేదు.. అని అనిపిస్తుంటుంది. ప్రస్తుతం..

Viral Video: కరెంట్ లేకున్నా.. దుస్తులను ఇస్త్రీ చేస్తున్న ఈమె తెలివిని చూస్తే.. ముక్కున వేలేసుకుంటారు..

కొందరి ఆలోచనా విధానం, వారు చేసే పనులు విచిత్రంగా అనిపిస్తుంటాయి. ఇంకొందరు వినూత్నంగా ఆలోచిస్తూ చేసే పనులు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇలాంటి వారిని చూసినప్పుడు.. అరె! ఇలాంటి ఆలోచన మనకెందుకు రాలేదు.. అని అనిపిస్తుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోవడంతో ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఓ మహిళకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. కరెంట్ లేకున్నా దుస్తులను ఇస్త్రీ చేస్తున్న మహిళ తెలివిని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ (woman) తన పిల్లల దుస్తులను ఇస్త్రీ చేయాలనుకునే (Ironing clothes) సమయంలో ఇంట్లో కరెంట్ పోయింది. అయితే ఎలాగైనా ఇస్త్రీ చేయాలని వివిధ రకాలుగా ఆలోచించింది. చివరకు ఆమె దృష్టి వంట గదిపై పడింది. ఇంకేముందీ.. వెంటనే వంట గదిలోకి వెళ్లి స్టవ్ (Gas stove) ఆన్ చేసింది. ఐరన్ బాక్స్‌ని స్టవ్ మంటపై పెట్టింది. బాగా వేడెక్కగానే పక్కనే దుస్తులను ఉంచుకుని ఇస్త్రీ చేసేసింది.

Whatsapp: వాట్సప్‌ వీడియోలో స్నేహితుడి కూతురిని అలా చూసి షాక్ అయిన వ్యక్తి.. విచారించగా చివరకు ఏం తెలిసిందంటే..

ఇలా గ్యాస్ స్టవ్‌ను ఉపయోగించి తన పనిని పూర్తి చేసేసేంది. సదరు మహిళ ఇస్త్రీ చేస్తుండగా.. కుటుంబ సభ్యులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘గ్యాస్ స్టవ్‪‌ను ఇలాక్కూడా వాడుకోవచ్చా’’.. అని కొందరు, ‘‘ఈమె తెలివికి హ్యాట్సాప్’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి ఐడియా మాకెందుకు రాలేదబ్బా’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Wife: వీడియోల్లో ఉన్నట్లుగానే చేయాలని చెప్పడంతో షాక్ అయిన భార్య.. వద్దని వారిస్తున్నా చివరకు అతడు చేసిన నిర్వాకంతో..

Updated Date - 2023-07-05T20:38:08+05:30 IST