Viral Video: ఆహారం దొరక్కపోతే ఇలాక్కూడా చేస్తాయా.. వామ్మో! ఈ ఎలిగేటర్ ఆవేశం చూస్తే షాకవ్వాల్సిందే..

ABN , First Publish Date - 2023-07-19T16:57:14+05:30 IST

మొసళ్లు ఎంత భయంకరమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి జంతువునైనా అవలీలగా నీటిలోకి లాగేస్తుంటాయి. కొన్నిసార్లు భారీ జంతువులైన ఏనుగులు కూడా వాటి బారిన పడి తప్పించుకోవడానికి నానా తంటాలు పడుతుంటాయి. ఇక చిన్న చిన్న జంతువులైతే...

Viral Video: ఆహారం దొరక్కపోతే ఇలాక్కూడా చేస్తాయా.. వామ్మో! ఈ ఎలిగేటర్ ఆవేశం చూస్తే షాకవ్వాల్సిందే..

మొసళ్లు ఎంత భయంకరమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి జంతువునైనా అవలీలగా నీటిలోకి లాగేస్తుంటాయి. కొన్నిసార్లు భారీ జంతువులైన ఏనుగులు కూడా వాటి బారిన పడి తప్పించుకోవడానికి నానా తంటాలు పడుతుంటాయి. ఇక చిన్న చిన్న జంతువులైతే మొసళ్ల సమీపానికి వెళ్లడానికి కూడా సాహసించవు. మొసలి దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ మొసలికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఆహారం దొరక్కపోతే.. ఇలాక్కూడా చేస్తాయా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ గట్టు పైన కొన్ని మొసళ్లు (Crocodiles) ఆహారం కోసం వేచి చూస్తూ ఉంటాయి. అయితే వాటికి ఆహారం దొరకలేదో ఏమో తెలీదు గానీ.. అప్పటికే వాటిలో ఓ ఎలిగేటర్ (Alligator) ఆగ్రహంతో ఉంటుంది. పక్కన ఉన్న మొసలి దగ్గరికి రాగానే ఒక్కసారిగా దాని కోపం కట్టలు తెంచుకుంటుంది. వెంటనే దానిపై దాడి (Alligator attack on crocodile) చేసి.. కాలును పట్టుకుంటుంది. గట్టిగా పట్టుకుని మెలితిరుగడంతో కాలు సగ భాగం ఊడి వస్తుంది.

Viral Video: రైల్వే ప్లాట్‌ఫామ్‌పై రాత్రి వేళ ప్రేమికుల వింత నిర్వాకం.. యువతి ముందు అతనిలా ఎందుకు చేశాడంటూ..

దెబ్బతిన్న మొసలి సైలెంట్‌గా పడుకుని ఉండిపోతుంది. దాడి చేసిన మొసలి కాలిని నమిలి మింగేస్తుంది. ఈ భయంకర దృశ్యం చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఓ వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో! ఇలాంటి దృశ్యం ఎప్పుడూ చూడలేదు’’.. అని కొందరు, ‘‘ఈ మొసలి ఆవేశం చూస్తుంటే భయమేస్తోంది’’.. అని మరికొందరు, ‘‘దీనికి బాగా ఆకలిగా ఉన్నట్టుంది’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వేలల్లో లైకులను సొంతం చేసుకుంది.

India-Pakistan: ఈ మహిళ సంగతి సరే కానీ.. 8 ఏళ్ల క్రితం భారత్‌లోకి అక్రమంగా వచ్చిన పాకిస్తానీ మహిళను ఏం చేశారంటే..!

Updated Date - 2023-07-19T16:57:14+05:30 IST