Viral Video: జలపాతం వద్దకు వెళ్తూ దొరికిపోయిన యువతీయువకులు.. చివరకు అందరినీ రైలు పట్టాల పక్కన వరుసగా నిలబెట్టి మరీ..
ABN , First Publish Date - 2023-07-18T21:56:37+05:30 IST
చాలా మంది యువతీయువకులు.. తప్పని తెలిసినా నిబంధనలను అతిక్రమిస్తుంటారు. కొందరు యువతులు కూడా తామేమీ తక్కువ కాదంటూ యువకులతో పోటీపడి మరీ రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
చాలా మంది యువతీయువకులు.. తప్పని తెలిసినా నిబంధనలను అతిక్రమిస్తుంటారు. కొందరు యువతులు కూడా తామేమీ తక్కువ కాదంటూ యువకులతో పోటీపడి మరీ రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నిబంధనలు అతిక్రమించి మరీ జలపాతం చూసేందుకు వెళ్తున్న యువతీయువకులను పోలీసులు అడ్డుకున్నారు. చివరకు ఏం చేశారంటే..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. గోవాలోని దూద్ సాగర్ జలపాతం (Dudh Sagar Falls) సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వర్షాకాలంలో దూద్ సాగర్ జలపాతాన్ని చూసేందుకు బెంగళూరు, మంగళూరు, ఉత్తర కర్ణాటక, హుబ్లీ, పూణే తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు (Tourists) అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇటీవల సంగ్యూమ్ తాలూకాలోని మైనాపి జలపాతంలో ఇద్దరు మునిగిపోయి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీనికితోడు ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోవా ప్రభుత్వం (Goa Government) రాష్ట్రంలోని జలపాతాల సందర్శనపై నిషేధం విధించింది.
ఇదిలావుండగా, ఇటీవల కొందరు యువతీయువకులు కొలెం స్టేషన్లో దిగి దూద్ సాగర్ జలపాతం వద్దకు ఎవరికీ తెలీకుండా నడుచుకుంటూ వెళ్తూ పోలీసుల కంట పడ్డారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు.. వారందరినీ రైలు పట్టాల పక్కనే నిలబెట్టి గుంజీలు తీయించారు. ఇంకోసారి ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపించేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.