Viral Video: గుండెను పిండేస్తున్న దృశ్యం.. నీటిలో మునిగిపోయిన ఒరంగుటాన్.. కాపాడేందుకు వ్యక్తి ప్రయత్నించడంతో.. చివరకు..

ABN , First Publish Date - 2023-07-16T20:02:53+05:30 IST

ప్రమాదమని తెలిసినా.. పులులు, సింహాలతో చెలగాటం ఆడి చివరకు కొందరు ప్రాణాలు పొగొట్టుకుంటే.. మరికొందరు చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా త్రుటిలో తప్పించుకుంటుంటారు. అయితే ఇంకొందరు మాత్రం.. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ జంతువుల ప్రాణాలను కాపాడుతుంటారు. ప్రస్తుతం ...

Viral Video: గుండెను పిండేస్తున్న దృశ్యం.. నీటిలో మునిగిపోయిన ఒరంగుటాన్.. కాపాడేందుకు వ్యక్తి ప్రయత్నించడంతో.. చివరకు..

ప్రమాదమని తెలిసినా.. పులులు, సింహాలతో చెలగాటం ఆడి చివరకు కొందరు ప్రాణాలు పొగొట్టుకుంటే.. మరికొందరు చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా త్రుటిలో తప్పించుకుంటుంటారు. అయితే ఇంకొందరు మాత్రం.. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ జంతువుల ప్రాణాలను కాపాడుతుంటారు. ప్రస్తుతం ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ జూలో అంతా చూస్తుండగా ఒరంగుటాన్.. నీళ్లల్లో పడిపోయి మునిగిపోతుంది. దాన్ని కాపాడేందుకు ఓ వ్యక్తి సడన్‌గా అందులోకి దూకాడు. చివరకు ఏమైందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. సందర్శకులు ఓ జూలో (Zoo) జంతువులను ఆసక్తిగా తిలకిస్తుంటారు. ఒరంగుటాన్ ఎన్‌క్లోజర్ వద్దకు వెళ్లగానే షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. పిల్ల ఒరంగుటాన్ ఆడుకుంటూ ఆడుకుంటూ నీటి వద్దకు వెళ్తుంది. సడన్‌గా అందులో పడి (orangutan fell into the water) ఒడ్డుకు రాలేక గిలాగిలా కొట్టుకుంటుంది. దాన్ని గమనించిన తల్లి ఒరంగుటాన్ అక్కడికి వెళ్తుంది. అయితే కాపాడేందుకు వీలు కాక.. చివరకు దీనంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇదంతా గమనిస్తున్న సందర్శకులు.. అయ్యో పాపం! అనుకుంటూ ఉంటారు.

Viral Video: ఎందుకొచ్చిన పెళ్లిరా అంటూ తల పట్టుకున్న వధూవరులు... భోజన సమయంలో యువకుల నిర్వాకంతో..

ఇంతలో జూ సిబ్బంది ధైర్యం చేసి నీటిలోకి దూకేస్తాడు. నీటిలోకి మునిగి చాలా సేపు వెతికి.. చివరకు ఒరంగుటాన్ పట్టుకుని, అతి కష్టం మీద ఒడ్డుకు తీసుకొస్తాడు. పైకి తీసుకెళ్లి నీటిని కక్కించేందుకు కడుపు మీద చేతులు పెట్టి చాలా సేపు నొక్కుతాడు. ఆ సమయంలో ఒరంగుటాన్ ప్రాణాలతో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే వీడియో అంతటితో ముగుస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు.‘‘అయ్యో! పాపం ఎంత దారుణం జరిగింది’’.. అని కొందరు, ‘‘ఈ వ్యక్తి నిజంగా గ్రేట్’’.. అంటూ మరికొందరు, ‘‘ఒరంగుటాన్ ప్రాణాలతో ఉంటుందని ఆశిస్తున్నాం’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral: ఇది నిజంగా అద్భుతమే.. ఆ ఊళ్లో అయిదేళ్లుగా ఇదే సీన్.. ఒక్కసారైనా ఈ వింతను చూద్దామని తరలి వస్తున్న జనం..!

Updated Date - 2023-07-16T20:02:53+05:30 IST