Viral Video: వ్యోమగాముల కష్టాలు మరీ ఈ రేంజ్‌లో ఉంటాయా..? అంతరిక్షంలో ఉండగా వేడి వేడి కాఫీ తాగాలంటే..!

ABN , First Publish Date - 2023-10-03T16:40:01+05:30 IST

చెట్టు నుంచి కిందకు రాలిన యాపిల్‌ను గమనించిన న్యూటన్‌.. అందుకు కారణాన్ని అన్వేషించే క్రమంలో చివరకు గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన విషయం అందరికీ తెలిసిందే. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉండడం వల్ల మనం నేల మీద నడవగులుతున్నాం. అలాగే...

Viral Video: వ్యోమగాముల కష్టాలు మరీ ఈ రేంజ్‌లో ఉంటాయా..? అంతరిక్షంలో ఉండగా వేడి వేడి కాఫీ తాగాలంటే..!

చెట్టు నుంచి కిందకు రాలిన యాపిల్‌ను గమనించిన న్యూటన్‌.. అందుకు కారణాన్ని అన్వేషించే క్రమంలో చివరకు గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన విషయం అందరికీ తెలిసిందే. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉండడం వల్ల మనం నేల మీద నడవగులుతున్నాం. అలాగే వస్తువులు కూడా పైకి తేలకుండా భూమి మీదే ఉన్నాయి. అయితే అంతరిక్షంలో పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుందనే విషయం అదరికీ తెలిసిందే. మనుషులతో పాటూ ప్రతి చిన్న వస్తువూ గాల్లోకి లేవడం చూస్తూ ఉంటాం. అయితే ఇదే సమయంలో వ్యోమగాముల దినచర్య గురించి చాలా మందికి ఎన్నో సందేహాలు ఉంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, అంతరిక్షంలో వేడి వేడి కాఫీ తాగుతున్న ఓ వ్యోమగామి వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘వ్యోమగాముల కష్టాలు మరీ ఈ రేంజ్‌లో ఉంటాయా..?’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని (International Coffee Day) పురస్కరించురకుని అక్టోబర్ 1న.. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. అంతరిక్ష కేంద్రంలో వేడి వేడి కాఫీని తాగే విధానాన్ని (Astronaut drinking coffee in space) సమంతా క్రిస్టోఫోరెట్టి అనే మహిళ చేసి చూపిస్తుంది. ముందుగా ఆమె ప్యాక్ చేసి ఉన్న కాఫీ ప్యాకెట్ తీసుకుని, ఓ సీసాలో పోసుకుని తాగేందుకు ప్రయత్నిస్తుంది. ప్యాకెట్‌కు ఉన్న పైపు ద్వారా కాఫీని సీసాలో పోస్తుంది కానీ.. దాన్ని తాగడం మాత్రం సాధ్యం కాదు. గాల్లోకి తేలే గుణం ఉండడం వల్ల సీసాలోని కాఫీ బయటికి రాదు.

Viral Video: అమెరికా స్కూళ్లలో ఇలా కూడా జరుగుతుందా.. క్లాసు రూంలో ఏమాత్రం భయం లేకుండా.. ఈ అమ్మాయి చేసిన పని చూడండి..

దీంతో తర్వాత మరో ప్రయోగం చేస్తుంది. తర్వాత ఇందుకోసమే ప్రత్యేకంగా రూపొందించిన మాస్క్ ఆకారంలో ఉన్న ప్లాస్టిక్ కప్పు తీసుకుని, అందులో కాఫీని పోస్తుంది. దీంతో ఫైనల్‌గా వేడి వేడి కాఫీని ఈజీగా తాగేస్తుంది. ఈ మైక్రోగ్రావిటీ కప్పులు అంతరిక్షంలో కాఫీ తాగేందుకు వీలుగా తయారుచేయబడ్డాయని తెలిసింది. కాగా, ఈ వీడియో (Viral video) ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్! ఐడియా చాలా బాగుంది’’.. అని కొందరు, ‘‘అందరిక్షంలో వేడి వేడి కాఫీ.. సూపర్..’’ అని మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: లిఫ్ట్‌లో ఒంటరిగా ఉందని చొరవ తీసుకున్న యువకుడు.. మొదటిసారి క్షమించిన యువతి.. చివరికి రెండోసారి..

Updated Date - 2023-10-03T16:40:01+05:30 IST