Viral Video: ప్రమాదవశాత్తు రైలు కింద పడిన యువకుడు.. కాపాడేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్.. చివరికి ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-10-01T19:22:37+05:30 IST

రైలు ప్రయాణ సమయాల్లో కొందరు తొందరపాటు కారణంగా, మరికొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రమాదాలకు గురవడం చూస్తూనే ఉంటాం. ప్రధానంగా రైలు ఎక్కి, దిగే సమయంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే ఇలాంటి సమయంలో కొన్నిసార్లు..

Viral Video: ప్రమాదవశాత్తు రైలు కింద పడిన యువకుడు.. కాపాడేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్.. చివరికి ఏం జరిగిందంటే..

రైలు ప్రయాణ సమయాల్లో కొందరు తొందరపాటు కారణంగా, మరికొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రమాదాలకు గురవడం చూస్తూనే ఉంటాం. ప్రధానంగా రైలు ఎక్కి, దిగే సమయంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే ఇలాంటి సమయంలో కొన్నిసార్లు ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, బీహార్‌లో ఈ తరహా ఘటనే జరిగింది. ప్రమాదవశాత్తు రైలు కింద పడిన యువకుడిని ఓ కానిస్టేబుల్ కాపాడే ప్రయత్నం చేశాడు. అయితే చివరకు ఏం జరిగిందంటే..

బీహార్ (Bihar) బగాహ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైలు (Express train) ఆగడంతో ప్రయాణికులు హడావుడిగా ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఇంతలో రైల్లో ఉన్న యువకుడు బిస్కెట్లు, కూల్‌డ్రింక్స్ కోసం రైలు దిగాడు. అయితే తీరా అన్నీ తీసుకునేలోగానే రైలు కదిలింది. దీంతో పరుగెత్తుకుంటూ వెళ్లి రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అదుపుతప్పి రైలుకు (young man fell under the train) ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో పడిపోయాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ పరుగెత్తుకుంటూ వెళ్లి కాపాడే ప్రయత్నం చేశాడు. అయితే దగ్గరికి వెళ్లే లోపే అతను కిందపడిపోయాడు. కింద పడ్డ యువకుడు అదృష్టవశాత్తు పట్టాల మధ్యలో పడిపోయాడు.

Viral Video: సినిమా తరహా షాట్స్ కోసం రైలు పట్టాల మీదకు వెళ్లిన యువకుడు.. తీరా ఫోన్‌లో రికార్డ్ చేస్తుండగా..

చివరకు రైలు యువకుడి అతడి మీదుగా వెళ్లిపోయింది. కిందపడ్డ యువకుడికి ఏమైందో అని ప్లాట్‌ఫామ్‌పై ఉన్న వారు కంగారుగా గమనిస్తున్నారు. అయితే పట్టాలపై నేలకు ఆనుకుని పడుకోవడంతో అతడికి ఏమీ కాలేదు. రైలు అటు వెళ్లగానే కిందకు దిగిన కానిస్టేబుల్, మరికొందరు యువకుడిని పైకి లేపారు. తలకు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. యువకుడు బెటియా పరిధి పోఖారా ప్రాంత నివాసి అని తెలిసింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతను ఎంతో అదృష్టవంతుడు’’.. అని కొందరు, ‘‘ఇది నిజంగా అద్భుతం’’.. అని మరికొందరు, ‘‘రైలు ప్రయాణ సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: అమెరికా స్కూళ్లలో ఇలా కూడా జరుగుతుందా.. క్లాసు రూంలో ఏమాత్రం భయం లేకుండా.. ఈ అమ్మాయి చేసిన పని చూడండి..

Updated Date - 2023-10-01T19:22:37+05:30 IST