Viral Video: అంతమంది ఫొటోలు దిగుతున్నా కిక్కురుమనలేదు.. మహిళ రాగానే ఒక్కసారిగా ఈ మొసలి చేసిన పని చూడండి..

ABN , First Publish Date - 2023-04-30T18:38:32+05:30 IST

జంతువులు వేటి జోలికి వెళ్లినా మొసలి జోలికి వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాయి. అందులోనూ నీటిలో ఉన్న మొసలి వద్దకు వెళ్లేందుకు ఏనుగులు, పులులు, సింహాలు వంటి జంతువులు కూడా సాహసం చేయవు. దాడి చేసే సమయంలో..

Viral Video: అంతమంది ఫొటోలు దిగుతున్నా కిక్కురుమనలేదు.. మహిళ రాగానే ఒక్కసారిగా ఈ మొసలి చేసిన పని చూడండి..

జంతువులు వేటి జోలికి వెళ్లినా మొసలి జోలికి వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాయి. అందులోనూ నీటిలో ఉన్న మొసలి వద్దకు వెళ్లేందుకు ఏనుగులు, పులులు, సింహాలు వంటి జంతువులు కూడా సాహసం చేయవు. దాడి చేసే సమయంలో చలనం లేనట్లుగా పడి ఉండే మొసలి.. సమీపానికి ఎవరైనా వస్తే వెంటనే దాడి చేయడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి వీడియోలు నెట్టింట ఎన్నో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం మొసలి దాడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ పెద్ద మొసలి ఒడ్డున పడుకుని ఉంటుంది. చనిపోయిందనుకుని చాలా మంది ఫొటోలు దిగుతుంటారు. అంతవరకూ కిక్కురుమనకుండా ఉన్న మొసలి.. ఓ మహిళ వద్దకు రాగానే ఏం చేసిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు (Viral videos) కొడుతోంది. ఓ పెద్ద మొసలి నడి ఒడ్డున పడుకుని ఉంటుంది. అటుగా వెళ్తున్న వారు మొదట దాన్ని చూసి భయపడతారు. అయితే ఎంత సేపు చూసినా దానిలో చలనం లేకపోవడంతో చనిపోయిందని అనుకుంటారు. మెల్లగా ఒక్కొక్కరుగా దగ్గరికి వెళ్లి మెల్లిగా తాకే ప్రయత్నం చేస్తారు. అయినా ఆ మొసలి (crocodile) కదలకపోవడంతో వారిలో భయం మొత్తం పోతుంది. వెంటనే అంతా తమ ఫోన్లు బయటికి తీసి.. మొసలితో ఫొటోలు, వీడియోలు (Photos and videos) తీసుకుంటూ ఉంటారు. దానిపై దర్జాగా చేయి వేసి మరీ ఫొటోలు దిగుతుంటారు. ముగ్గురు వ్యక్తులు మొసలిపై చేయి వేసి స్మైల్ ఇస్తూ ఫొటోలు తీసుకుంటూ ఉండగా.. మధ్యలో ఓ మహిళ కూడా అక్కడికి వెళ్తుంది.

Viral news: చదువుకున్న బ్యాచ్‌లర్స్ కదా అని ఇల్లు అద్దెకిస్తే.. ఎంత పని చేశారో చూడండంటూ ఫొటోలను బయటపెట్టిన యజమాని..

చివరకు ఆమె కూడా మొసలిపై చేయి వేసేందుకు ప్రయత్నిస్తుంది. అంతవరకూ కిక్కురమనకుండా ఉన్న మొసలి.. సదరు మహిళ దగ్గరికి రాగానే ఒక్కసారిగా పైకి లేచి దాడికి (Crocodile attack on women) దిగుతుంది. దీంతో వీడియో తీస్తున్న వ్యక్తి.. భయంతో అక్కడి నుంచి పరుగులు పెడతాడు. చూస్తుంటే ఈ దాడిలో మహిళకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు. ‘‘అయ్యో పాపం! ఆ మహిళకు ఏమైందో ఏమో’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పిచ్చి పనులు ఇంకోసారి చేయకండి’’.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral News: వాంతి వస్తుండడంతో కారు ఆపిన వరుడు.. వెంటనే వాహనం దిగి కేకలు పెట్టిన వధువు.. చివరకు ఆమె తండ్రి వచ్చి అసలు విషయం చెప్పడంతో..

Updated Date - 2023-04-30T18:38:32+05:30 IST