Viral Video: లేగదూడ మునిగిపోతుండడం చూసి.. సడన్‌గా నీటిలోకి దూకిన యువకుడు.. చివరికి ఏమైందంటే..

ABN , First Publish Date - 2023-05-10T15:36:17+05:30 IST

సాటి మనుషుల పట్ల కనీస సానుభూతి కూడా చూపించని ఈ రోజుల్లో కూడా కొందరు.. మనుషులతో పాటూ జంతువుల పట్ల కూడా అమితమైన ప్రేమను కనబరుస్తుంటారు. కొందరైతే తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి జంతువులను రక్షిస్తుంటారు. ఇలాంటి..

Viral Video: లేగదూడ మునిగిపోతుండడం చూసి.. సడన్‌గా నీటిలోకి దూకిన యువకుడు.. చివరికి ఏమైందంటే..

సాటి మనుషుల పట్ల కనీస సానుభూతి కూడా చూపించని ఈ రోజుల్లో కూడా కొందరు.. మనుషులతో పాటూ జంతువుల పట్ల కూడా అమితమైన ప్రేమను కనబరుస్తుంటారు. కొందరైతే తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి జంతువులను రక్షిస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ వ్యక్తి లేగదూడను కాపాడిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. లేగదూడను మునిగిపోతుండడాన్ని చూసిన ఓ యువకుడు.. సడన్‌గా నీటిలోకి దూకేస్తాడు. చివరకు ఏమవుతుందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. సముద్రపు (Sea) ఒడ్డున ఏర్పాటు చేసిన మెట్ల మార్గం వద్ద నీటి ఉదృతి ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఓ లేగదూడ (calf) అటుగా వెళ్తుంది. మధ్యలో ఉన్నట్టుండి నీటిలోకి జారిపోతుంది. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న దూడను అక్కడే ఉన్న ఓ యువకుడు (young man) గమనిస్తాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే లోపలికి దూకేస్తాడు. జారుకుంటూ వచ్చి ధమేల్‌మని నీటిలో పడిపోతాడు. దూడ వద్దకు ఈదుకుంటూ వెళ్లి.. మునిగిపోయిన దూడను పైకి లేపుతాడు.

Viral News: పెళ్లిలో ఫొటోలు దిగుతుండగా.. ఉన్నట్టుండి అనుకోని అతిథి రావడం చూసి .. వధువుతో కలిసి పారిపోయిన వరుడు.. చివరకు..

తర్వాత ఎలాగోలా ఒడ్డుకు చేరకుస్తాడు. అయితే దూడను పైకి ఎత్తేందుకు ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఈ క్రమంలో అతడి ఇబ్బందిని గుర్తించిన యువకుడు.. దూడను పట్టుకుని పైకి లాగుతాడు. చివరకు ఇద్దరూ కలిసి దూడను క్షేమంగా బయటికి తీసుకొస్తారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ప్రాణాలకు తెగించి దూడను కాపాడిన యువకుడిని అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో లైకులను (Millions of likes) సొంతం చేసుకుంది.

Viral Video: వధువు మెడలో వేస్తుండగా సడన్‌గా తెగిపోయిన దండ.. వరుడు కంగారుపడుతుంటే.. మధ్యలో ఈ వ్యక్తి ఏం చేశాడో చూడండి..

Updated Date - 2023-05-10T15:36:17+05:30 IST