Viral Video: మీ కళ్లను మీరే నమ్మలేరు.. పడవ సాయం లేకుండానే ఇతను చేపలు ఎలా పడుతున్నాడో చూడండి..

ABN , First Publish Date - 2023-05-07T19:48:12+05:30 IST

కొన్ని దృశ్యాలు చూస్తే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. చివరగా అందులో లాజిక్ తెలుసుకుని.. అరె! ఇదా అసలు విషయం.. అని అనుకుంటూ ఉంటాం. ఇలాంటి అరుదైన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం..

Viral Video: మీ కళ్లను మీరే నమ్మలేరు.. పడవ సాయం లేకుండానే ఇతను చేపలు ఎలా పడుతున్నాడో చూడండి..

కొన్ని దృశ్యాలు చూస్తే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. చివరగా అందులో లాజిక్ తెలుసుకుని.. అరె! ఇదా అసలు విషయం.. అని అనుకుంటూ ఉంటాం. ఇలాంటి అరుదైన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి వేగంగా పారుతున్న నదిలో పడవ సాయం లేకుండానే చేపలు పట్టడం చూసి అంతా షాక్ అవుతున్నారు. అయితే చివరగా అందులో లాజిక్ తెలుసుకుని.. అరె! ఈ కెమెరామెన్ ఎంత మోసం చేశాడు.. అని కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral video) అవుతోంది. వేగంగా పారుతున్న నదిలోకి ఓ వ్యక్తి చేపలు పట్టేందుకు (fishing) వెళ్తాడు. పెద్ద కర్రకు తగిలించిన వల మాత్రమే తీసుకెళ్తాడు. ఎలాంటి పడవ సాయం లేకుండానే (Fishing without boat) నదిలోకి దిగుతాడు. కానీ అతను ఏమాత్రం నీటిలో మునిగిపోడు. కేవలం పాదాలు తప్ప మిగతా శరీరం మొత్తం నీటి పైనే ఉంటుంది. నదిలో పడవ కంటే వేగంగా కదులుతూ ముందుకు పోవడం చూస్తే.. ఇతడికి అతీత శక్తులేమైనా ఉన్నాయా.. అని అనిపిస్తుంది. చేపలను టార్గెట్ చేసిన వ్యక్తి ఉన్నట్టుండి పడవ దిగినట్లుగా.. పరుగెత్తుకుంటూ వెళ్లి వలతో టక్కున ఓ చేపను పట్టేస్తాడు.

Viral Video: ఎరక్కపోయి వచ్చి.. ఇరుక్కుపోయాడు.. ఇతన్ని ఎలా కాపాడాలో మీరైనా చెప్పగలరా..

అయినా అతను మాత్రం నీటిపై తేలుతూనే ఉంటాడు. అయితే ఇందులో జాగ్రత్తగా గమనిస్తే.. అక్కడ తక్కువ లోతు ఉందనే విషయం అర్థమవుతుంది. అలాగే వేగంగా పారుతున్న నీటికి వ్యతిరేకంగా మోకాళ్లపై కూర్చోవడం వల్ల.. అతను ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తుంది. కానీ అతను కూర్చున్నచోటే ఉన్నాడు తప్ప.. ముందుకు వెళ్లలేదు. చివరగా చేపను చూడగానే పైకి లేచి పరుగెత్తుకుంటూ వెళ్తాడు. ఈ వీడియో వారంతా చివరకు అసలు విషయం తెలుసుకుని.. కెమెరామెన్ (Cameraman) తెలివిని మెచ్చుకుంటున్నారు. ‘‘నిజంగా మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంది’’.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: కారుకు పెట్రోల్ పట్టేందుకు తెగ శ్రమించింది.. చివరకు యజమాని చెప్పింది విని నాలుక్కరుచుకున్న యువతి..

Updated Date - 2023-05-07T19:48:12+05:30 IST