Viral Video: అమ్మ బాబోయ్!.. వీడేంటీ ఇలా చేస్తున్నాడు.. ఏకంగా బతికున్న పాము తలను నోట్లో పెట్టుకుని మరీ..

ABN , First Publish Date - 2023-05-07T18:13:45+05:30 IST

కొందరు జంతువుల పట్ల విపరీతమైన ప్రేమ చూపిస్తుంటారు. ఇంకొందరు క్రూర జంతువులను కూడా సాధు జంతువుల తరహాలో వాటితో ఆడుకుంటూ ఉంటారు. ఇంకొందరు పాములను కూడా పసి పిల్లల మాదిరి చూసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు..

Viral Video: అమ్మ బాబోయ్!.. వీడేంటీ ఇలా చేస్తున్నాడు.. ఏకంగా బతికున్న పాము తలను నోట్లో పెట్టుకుని మరీ..

కొందరు జంతువుల పట్ల విపరీతమైన ప్రేమ చూపిస్తుంటారు. ఇంకొందరు క్రూర జంతువులను కూడా సాధు జంతువుల తరహాలో వాటితో ఆడుకుంటూ ఉంటారు. ఇంకొందరు పాములను కూడా పసి పిల్లల మాదిరి చూసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓ వ్యక్తి పామును మెడలో వేసుకోవడమే కాకుండా దాని తలను నోట్లో పెట్టుకుంటాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా (Viral videos) మారింది. జార్ఖండ్ జంషెడ్‌పూర్‌కు (Jamshedpur) చెందిన ఓ యువకుడి ప్రవర్తన చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. తలకు ఎర్రటి టోపీ పెట్టుకున్న యువకుడు.. మెడలో పామును (Snake in the neck) వేసుకుని కెమెరా ముందుకు వస్తాడు. చిన్నపిల్లాడిని ఎత్తుకున్నట్లుగా.. ఎలాంటి అదురూబెదురూ లేకుండా ఉన్న అతన్ని చూసి పక్కన వారు కూడా షాక్ అవుతారు.

Viral Video: ఎరక్కపోయి వచ్చి.. ఇరుక్కుపోయాడు.. ఇతన్ని ఎలా కాపాడాలో మీరైనా చెప్పగలరా..

పామును ఎంతో ప్రేమగా పట్టుకుని, చివరకు దాని తలను నోట్లో పెట్టుకుని ముద్దులు (young man kissed the snake) కురిపిస్తాడు. అయితే విచిత్రంగా ఆ పాము ఏమీ అనకుండా సైలెంట్‌గా ఉండిపోతుంది. ‘‘ఇది నా ఫ్రెండ్’’.. అంటూ పామును అందరికీ పరిచయం చేస్తాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. ‘‘పాములతో కాస్త జాగ్రత్త నాయనా’’... అంటూ కొందరు, ‘‘టైం బాగుంది కాబట్టి సరిపోయింది లేదంటేనా’’.. అని మరికొందరు, ‘‘అతడి ప్రేమకు పాము కరిగిపోయింది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

Viral Video: కారుకు పెట్రోల్ పట్టేందుకు తెగ శ్రమించింది.. చివరకు యజమాని చెప్పింది విని నాలుక్కరుచుకున్న యువతి..

Updated Date - 2023-05-07T18:13:45+05:30 IST