భార్యను తండ్రి గదిలోకి పంపించాలని భర్త ప్రయత్నం.. ఓ రోజు ఇదే విషయాన్ని ఆమెకు చెప్పి.. చివరకు..
ABN , First Publish Date - 2023-03-05T20:03:56+05:30 IST
జీవితాంతం భర్తే దైవంగా బతుకుంటారు చాలా మంది భార్యలు. కానీ కొందరు భర్తలు మాత్రం భార్య ప్రేమను అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తుంటారు. అంతటితో ఆగకుండా వారిని చిత్రహింసలకు గురి చేస్తుంటారు. ఇంకొందరైతే..
జీవితాంతం భర్తే దైవంగా బతుకుంటారు చాలా మంది భార్యలు. కానీ కొందరు భర్తలు మాత్రం భార్య ప్రేమను అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తుంటారు. అంతటితో ఆగకుండా వారిని చిత్రహింసలకు గురి చేస్తుంటారు. ఇంకొందరైతే మరీ దారుణంగా, భార్యను పరాయి మగవారి వద్దకు పంపిచాలనే నీచమైన ఆలోచన చేస్తుంటారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లో ఓ వ్యక్తి.. ఏ భర్తా చేయని తప్పు చేశాడు. భార్యను ఏకంగా తన తండ్రి గదిలోకే పంపించాలని చూశాడు. అంతవరకూ చిత్రహింసలు పెట్టినా భరించిన భార్య.. ఈ మాటతో ఒక్కసారిగా షాక్ అయింది. చివరకు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) అలీగఢ్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి.. ఆగ్రాకు చెందిన యువతితో (young woman) ఇటీవలే వివాహమైంది. వివాహమైన కొత్తలో భార్యను ఎంతో బాగా చూసుకునేవాడు. అయితే రాను రాను భర్త ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. చీటికీమాటికీ భార్యను వేధిస్తూ (Harassment) ఉండేవాడు. భర్తే కదా అని ఆమె కూడా ఓపిగ్గా భరిస్తూ వచ్చింది. అయితే రోజురోజుకూ చిత్రహింసలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో అత్తమామలకు తన సమస్యను వివరించింది. కొడుకును మందలించాల్సిన తల్లిదండ్రులు అందుకు విరుద్ధంగా వారు కూడా వేధించడం మొదలెట్టారు.
ఇటీవల భర్త ప్రవర్తన ఎంత నీచంగా తయారైందంటే.. ఓ రోజు భార్య వద్దకు వెళ్లి .. ‘‘ మా నాన్న గదిలోకి వెళ్లి పడుకో’’ (Indecent behavior) అని బలవంత పెట్టాడు. అంతవరకూ ఎంత వేధించినా భరిస్తూ వచ్చిన ఆమె.. భర్త నోటి నుంచి ఇలాంటి మాట రావడంతో ఒక్కసారిగా మనోవేదనకు గురైంది. మామ కూడా కోడలిని వేధిస్తుండడంతో చివరకు ఎదురుతిరిగింది. దీంతో భర్త ఆమెకు ట్రిపుల్ తలాక్ (Triple Talaq) చెప్పి, ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో చేసేదేమీ లేక చివరకు పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు మాత్రం భర్త, అత్తమామలపై ఎలాంటి కేసులూ నమోదు చేయలేదు. ఎన్ని రోజులు చూసినా పోలీసులు స్పందించకపోవడంతో చివరకు జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.