Share News

Renuka chowdari: పువ్వాడ అజయ్‌పై రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-11-22T09:59:50+05:30 IST

మంత్రి పువ్వాడ అజయ్‌పై మాజీ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Renuka chowdari: పువ్వాడ అజయ్‌పై రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు

ఖమ్మం: మంత్రి పువ్వాడ అజయ్‌పై (Minister Puvvada Ajay) మాజీ ఎంపీ రేణుకా చౌదరి (Former MP Renuka Chowdari) సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుకు (Congress Candidate Tummala Nageshwar Rao) మద్దతుగా కురవి మండలం బలపాల గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో రేణుకా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ... పువ్వాడ అజయ్ ఓటమి ఖాయమన్నారు. దుర్మార్గుడు దుష్టుడు అజయ్ డీ.ఎన్.ఏలోనే ప్రాబ్లం అంటూ వ్యాఖ్యలు చేశారు. నిస్సహాయంగా ఉండొద్దు ఓట్ అనే బ్రహ్మాస్త్రంతో అజయ్‌ను ఓడ గొట్టాలన్నారు. మన భవిష్యత్ కోసం తుమ్మల‌ను గెలిపించాలని కోరారు. తుమ్మల కాంగ్రెస్ లో చేరడం తనకు గర్వంగా ఉందన్నారు. అజయ్‌ను మించి కేసీఆర్ (CM KCR) అరాచకం చేశారన్నారు. ఈ ఎన్నికలు చారిత్రకమైనవని రేణుకా చౌదరి పేర్కొన్నారు.

Updated Date - 2023-11-22T09:59:51+05:30 IST