Mallareddy: కేంద్రానికి తెలియకుండానే మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారా?

ABN , First Publish Date - 2023-09-18T12:00:38+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను మంత్రి మల్లారెడ్డి ఖండించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ...ఏపీ సీఎం జగన్ రాజకీయ కక్షతో చంద్రబాబును అరెస్టు చేయించారని ఆరోపించారు. బాబు అరెస్టు వెనుక బీజేపీ హస్తముందని ఆరోపించారు.

Mallareddy: కేంద్రానికి తెలియకుండానే మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారా?

హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను (TDP Chief Chandrababu Arrest) మంత్రి మల్లారెడ్డి (Minister Malla Reddy) ఖండించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ...ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) రాజకీయ కక్షతో చంద్రబాబును అరెస్టు చేయించారని మండిపడ్డారు. బాబు అరెస్టు వెనుక బీజేపీ (BJP) హస్తముందని ఆరోపించారు. ఇది వైసీపీ, బీజేపీ కలిసి చేసిన కుట్ర అని వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి తెలియకుండా మాజీ ముఖ్యమంత్రి అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండానే అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. స్కిల్ డెవలప్మెంట్‌లో చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదన్నారు. బాబు కోసం ఐటి ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు తన మద్దతు తెలియజేశారు. చంద్రబాబు అరెస్ట్, అన్యాయం హేయమైన చర్య అని మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-09-18T12:00:38+05:30 IST