Share News

Prakash javadekar: బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది

ABN , First Publish Date - 2023-11-06T17:36:01+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఎంఐఎం ఒత్తిడితో పని చేస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో పోలీసులు పని చేస్తున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పోలీసుల స్థితి బాగుండేది. కానీ ఇప్పుడు పోలీసు వ్యవస్థను రాజకీయం చేసేశారు

Prakash javadekar: బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది

హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ జాతీయ నేత ప్రకాశ్ జవదేకర్ (Prakash javadekar) ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, కుటుంబ పాలనపై బీజేపీ (bjp) ఛార్జ్‌షీటు విడుదల చేసింది. అనంతరం జవదేకర్ మీడియాతో మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్ లాంటి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు ప్రాజెక్ట్‌ను అమ్ముకుంది. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వ పాలసీల వల్ల డ్రగ్స్, లిక్కర్ టెర్రరిజంకు చోటు దక్కింది. కట్టర్ ఇస్లామిక్ టెర్రరిజం మూలాలు తెలంగాణలో ఉన్నాయి. బంగ్లాదేశ్, బర్మా రోహింగ్యాలు మజ్లీస్ అండదండలతో పెరుగుతున్నారు. స్లీపర్ సెల్స్ లాగా వారు పెరుగుతున్నారు. పీఎఫ్‌ఐ (PFI) తో లింకులు ఇక్కడ బయటపడ్డాయి. ఎన్‌ఐఏ (NIA) ఇక్కడ కొందరిని అరెస్ట్ చేసింది.’’ అని జవదేకర్ చెప్పుకొచ్చారు.

కిషన్‌రెడ్డి..

‘‘రాష్ట్ర ప్రభుత్వం ఎంఐఎం ఒత్తిడితో పని చేస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో పోలీసులు పని చేస్తున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పోలీసుల స్థితి బాగుండేది. కానీ ఇప్పుడు పోలీసు వ్యవస్థను రాజకీయం చేసేశారు. ఏమైనా అంటే బదిలీలు చేస్తామని బెదిరిస్తున్నారు.’’ అని కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.

cbi.jpg

Updated Date - 2023-11-06T17:37:52+05:30 IST