MP Komati Reddy: నల్లగొండ, నకిరేకల్ నాకు రెండు కళ్లు

ABN , First Publish Date - 2023-10-01T17:57:26+05:30 IST

నల్లగొండ, నకిరేకల్(Nalgonda, Nakirekal) తనకు రెండు కళ్ల లాంటివని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(MP Komati Reddy Venkat Reddy) వ్యాఖ్యానించారు.

MP Komati Reddy: నల్లగొండ, నకిరేకల్ నాకు రెండు కళ్లు

నకిరేకల్: నల్లగొండ, నకిరేకల్(Nalgonda, Nakirekal) తనకు రెండు కళ్ల లాంటివని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (MP Komati Reddy Venkat Reddy) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు నకిరేకల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈసందర్భంగా కోమటిరెడ్డి వీుడియాతో మాట్లాడుతూ..‘‘ నకిరేకల్ నేతల ముందు ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య(Chirumurthy Lingaiah)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మేము దగ్గరుండి గెలిపిస్తే.. మమ్మల్ని దారుణంగా మాట్లాడుతున్నాడు. మేము ఫస్ట్ జెడ్పీటీసీ‌గా గెలిపిస్తే.. పెద్ద పదవి ఎందుకు అని అన్నాడు. తర్వాత ఎమ్మెల్యేగా గెలిపించాం.. ఒకటి కాదు రెండుసార్లు గెలిపించాను.ఇప్పుడు ఇష్టమున్నట్లు మాట్లాడుతుండు. నకిరేకల్‌లో రేపటి నుంచి ప్రచారం చేయండి. వేముల వీరేషం(Vemula Veeresham)ను గెలిపిద్దాం.. కార్యకర్తలు అందరూ కష్టపడి పని చేయండి. వీరేశంకు అన్ని రకాలుగా అండదండలు అందిస్తా. ఎన్నాళ్లు నకిరేకల్‌లో పార్టీని బతికించిన వారిని నేను చూసుకుంటా. ఎవరూ అధైర్యపడొద్దు. ఈసందర్భంగా కోమటిరెడ్డి సీఎం.. సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. కార్యకర్తలను కోమటిరెడ్డి. వారించారు. నకిరేకల్‌లో వీరేశంను గెలిపిస్తే.. సీఎం అయినంత సంతోషిస్తా. కాంగ్రెస్‌లో ఎవరు సీఎం అయినా.. ప్రజలకు అందుబాటులో ఉంటారు. కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. సూర్యాపేటలో ఈసారి మంత్రి జగదీష్‌రెడ్డికి డిపాజిట్ కూడా రాదు. ఉమ్మడి నల్గొండలో 12కు 12 స్థానాలు కాంగ్రెస్ గెలవబోతుంది.

జగదీష్‌రెడ్డికి డిపాజిట్ రాదు

మంత్రి జగదీష్‌రెడ్డి(Minister Jagdish Reddy)కి ఆయన అనుచర వర్గానికి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తాం. స్కూటర్ కూడా లేని జగదీష్‌రెడ్డి ఈరోజు వేల కోట్లకు అధిగమించాడు. కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు చేరిక విషయం నాకు తెలవదు. కాంగ్రెస్ అధికారం లోకి రావాలంటే ఒకొక్క సీటు అవసరం. ఔటర్ రింగ్ రోడ్డు, భూములు అమ్మి.. కేసీఆర్ పథకాలకు పైసలు ఇస్తున్నాడు. దళిత బంధులో ఎమ్మెల్యేలు కమీషన్ తీసుకుంటున్నారని సీఎం కేసీఆర్ అన్నాడు. అభ్యుదయ భావాలు ఉన్న వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీఃలోకి రావడం చాలా సంతోషం. ఎమ్మెల్యే చిరుముర్తి లింగయ్య గురించి మాట్లాడటం వెస్ట్. నకిరేకల్‌లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలతో చర్చించిన తర్వాతనే వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నాం. నకిరేకల్‌లో 50 వేల మెజార్టీతో వేముల వీరేశం గెలవబోతున్నాడు.’’ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.

కోమటిరెడ్డితో కలిసి పని చేస్తా: వేముల వీరేశం

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆశీస్సులతో ముందుకు వెళ్తానని కాంగ్రెస్ నేత వేముల వీరేశం(Vemula Veeresham) వ్యాఖ్యానించారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంను కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. పార్టీలోకి కూడా.. కోమటిరెడ్డి ఓకే అంటేనే వస్తానని చెప్పానని అన్నారు. ఈ రోజు నుంచి.. కోమటిరెడ్డితో కలిసి పని చేస్తానని వేముల వీరేశం తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈరోజు నుంచి కోమటిరెడ్డి డైరెక్షన్‌లోనే పనిచేస్తానని అన్నారు. నకిరేకల్‌ల్లో కాంగ్రెస్ గెలుపు కోసం స్థానికంగా ఉన్న శ్రేణులను కలుపుకొని వెళ్తాను. నల్లగొండ జిల్లాలో కలిసి పని చేయాలని కోమటిరెడ్డి చెప్పారు. నకిరేకల్ నియోజకవర్గం నుంచి వేముల వీరేశంను గెలిపించాలని కోమటిరెడ్డి అనుచరులకు సూచించారు. అత్యధిక మెజారిటీతో వేముల వీరేశం నకిరేకల్‌లో గెలవబోతున్నాడని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-10-01T17:57:26+05:30 IST